కంపు కొడుతున్న విశాఖ బీచ్ .. పట్టించుకోని అధికారులు ..

కంపు కొడుతున్న విశాఖ బీచ్ .. పట్టించుకోని అధికారులు ..
x
Highlights

సాగర సోయగాలు.. ప్రశాంత వాతావరణానికి కేరాఫ్‌ అడ్రస్‌ సుందర తీరం విశాఖ. ఆంధ్రాలో భూతల స్వర్గంగా పేరొందిర వైజాగ్‌....బీచ్‌ కంపుకొడుతోంది. పర్యాటకుల...

సాగర సోయగాలు.. ప్రశాంత వాతావరణానికి కేరాఫ్‌ అడ్రస్‌ సుందర తీరం విశాఖ. ఆంధ్రాలో భూతల స్వర్గంగా పేరొందిర వైజాగ్‌....బీచ్‌ కంపుకొడుతోంది. పర్యాటకుల మదిలో ముగ్థమనోహరమైన ముద్ర చేసుకున్న బీచ్‌ అందాలు మసకబారుతున్నాయి. సుందరమైన సాగరతీరం..ప్రశాంతమైన వాతావరణం.. ప్రకృతి కాన్వాస్ పై గీసిన ఓ అందమైన చిత్రంలా ఉంటుంది విశాఖ. నీలిసంద్రపు అందాలు..ఉవ్వెతున ఎగసిపడే అలలు ఎవరి మదినైనా కట్టిపడేస్తాయి. పర్యాటక రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న బీచ్‌ కాలుష్య కోరల్లో చిక్కుకుంది.

32 కిలో మీటర్ల పొడవున విస్తరించిన విశాఖ తీరంలో కైలసగిరి, రుషికొండ, యారడ, ఆర్కుబీచ్‌, సాగరనరగ్‌ ,బీమిలీ అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. హోటల్స్,రిసార్ట్స్, ఎయిర్ పోర్ట్,సువిశాలమైన రోడ్ కనెక్టివిటీ అందుబాటులో ఉండటంతో వైజాగ్ టూరిజం హబ్ గా మారింది. అలాంటి పర్యాటక కేంద్రం డంపింగ్‌ యార్డులను తలపిస్తున్నాయి. తీర ప్రాంతాలు కాలుష్య కాసారంగా మారిపోపోవడంతో పర్యవరణవేత్తలు ఆవేదన చెందుతున్నారు.

ఏటా విశాఖకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. దేశ,విదేశాల నుంచి ఏటా దాదాపు 5.4 లక్షల మంది పర్యాటకులు వస్తున్నారు. ఇక్కడి సందర్శనీయ ప్రాంతాలు ఎంతో ఆందంగా,ఆహ్లాదంగా వుండటంతో బీచ్‌ అందాలను చూసేందుకు క్యూ కడుతుంటారు. 22 లక్షల జనాభా కలిగిన విశాఖలో రోజుకు 1200 టన్నల ఘన వ్యర్ధాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో దాదాపు 700 టన్నుల మాత్రమే డంపింగ్‌ యార్డులకు చేరుతోందని... మిగిలిన వ్యర్థాలు వివిధ రూపాల్లో సముద్రంలోకి వదిలేస్తున్నారు. దాదాపు 200 మిలియన్‌ గ్యాలన్ల మురుగునీరు సముద్రంలో కలిసిపోతోంది.

డ్రైనేజీతో పాటు పరిశ్రమల వ్యర్థాలు నేరుగా సముద్రంలోకి వదలడంతో మత్ససంపద నాశనం అవుతోంది. విశా‌ఖ తీర ప్రాంతం ఓ వైపు కోతకు గురవుతూ... మరోవైపు వ్యర్ధాలతో నిండిపోవడంతో సహజత్వాన్ని కోల్పోతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. సముద్రంలోకి వదిలే వ్యర్థజలాలను శుద్ధి చేసి కానీ వదలకూడదనే నిబంధనలు ఉన్నప్పటికి... ఏమాత్రం లెక్కచేయకుండ సముద్రంలోకి వదిలివేయడంతో వ్యర్థాలతో నిండిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సముద్ర కాలుష్యంకు చెక్‌ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని పర్యాటక ప్రియులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించేలా అవగాహన కల్పించడంతో పాటు సాగరతీర అందాలను మరింత తీర్చిదిద్దాల్సిన అవసరముందంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories