ఏపీలో మొదటి ఫలితం ఇక్కడ నుంచే!

ఏపీలో మొదటి ఫలితం ఇక్కడ నుంచే!
x
Highlights

ఫలితాల కోసం నిరీక్షణ తో క్షణ..క్షణం.. అందరిలో ఉత్కంట నెలకొంది. ప్రజలంతా టీవీల ముందు ఇప్పటికే అతుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడి...

ఫలితాల కోసం నిరీక్షణ తో క్షణ..క్షణం.. అందరిలో ఉత్కంట నెలకొంది. ప్రజలంతా టీవీల ముందు ఇప్పటికే అతుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి మొదటి ఫలితం వస్తుందన్న ఆసక్తి అందరిలో ఉంది. ఏపీ ఎన్నికల్లో మొదటి ఫలితం నర్సాపురం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి వెల్లడయ్యే అవకాశం ఉంది. చివరిలో అంటే దాదాపు అన్ని పూర్తయిన తరువాత రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గాల ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.

ఓట్ల లెక్కింపు రౌండ్ లను బట్టి ఫలితాలు అందే అవకాశం ఉంటుంది. ఈక్కువ రౌండ్లు లెక్కించే దగ్గర ఆలస్యం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఏయే నియోజకవర్గాల్లో ఎన్నెన్ని రౌండ్ల లెక్కింపు జరుగుతుందో ఆ వివరాలు..

* నర్సాపురం 12-13 రౌండ్ల లెక్కింపు

* ఆచంట, కొవ్వూరు (ఎస్సీ) 13-14 రౌండ్ల లెక్కింపు

* పాలకొల్లు, మచిలీపట్నం, ఏలూరు, బాపట్ల, నెల్లూరు సిటీ 14-15 రౌండ్ల లెక్కింపు

* తాడేపల్లిగూడెం, నిడదవోలు, పెడన, చీరాల, మండపేట, చిత్తూరు, ఉంగుటూరు 15-16 రౌండ్ల లెక్కింపు

* గుంటూరు తూర్పు, నెల్లూరు గ్రామీణ,ప్రత్తిపాడు, అనపర్తి, నగరి, పార్వతీపురం, వేమూరు, మాడుగుల, విశాఖపట్నం దక్షిణ, విశాఖపట్నం పశ్చిమ 16-17 రౌండ్ల లెక్కింపు

* రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం 36-37 రౌండ్ల లెక్కింపు

* జగ్గంపేట 35 రౌండ్ల లెక్కింపు

* అమలాపురం 33రౌండ్ల లెక్కింపు

* పాణ్యం, నందిగామ, రాజమహేంద్రవరం సిటీ, తుని 32 రౌండ్ల లెక్కింపు

* పెద్దాపురం, గన్నవరం(ఎస్సీ), రాజానగరం, కాకినాడ సిటీ. 30-31 రౌండ్ల లెక్కింపు

Show Full Article
Print Article
Next Story
More Stories