‘గీత గోవిందం’ హవా.. ఇద్దరు స్టార్ హీరోలను వెనక్కి నెట్టేసిన విజయ్

Submitted by arun on Mon, 08/20/2018 - 12:08
Geetha Govindam

విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాజమౌళి, చిరంజీవి లాంటి ప్రముఖులు.. సినిమా బాగుందని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అందుకు పూర్తి విరుద్ధమైన గెటప్‌లో విజయ్ కనిపించిన ఈ సినిమాకు ప్రశంసలే కాదు కలెక్షన్లు కూడా బాగున్నాయి. ఇప్పటికే అమెరికాలో వన్ మిలియన్ క్లబ్‌లో చేరిన గీత గోవిందం, ఆస్ట్రేలియాలో ఈ చిత్రం ‘గోల్డ్’, ‘సత్యమేవ జయతే’ చిత్రాలతో పోటీ పడి అగ్రస్థానంలో ఉంది.

‘గీత గోవిందం’ చిత్రం విడుదలైన రోజే అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘గోల్డ్‌’, జాన్‌ అబ్రహం నటించిన ‘సత్యమేవ జయతే’ చిత్రాలు విడుదలయ్యాయి. ఆస్ట్రేలియాలో ‘గోల్డ్’, ‘సత్యమేవజయతే’ చిత్రాలు 192,306 ఆస్ట్రేలియన్‌ డాలర్ల వసూళ్లు రాబడితే.. ‘గీత గోవిందం’ 202,266 ఆస్ట్రేలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టి ఆ రెండు చిత్రాలను బీట్‌ చేసింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. రెండు బాలీవుడ్‌ చిత్రాలను దక్షిణాది చిత్రం బీట్‌ చేసిందని పేర్కొన్నారు.

Vijay Deverakonda’s Geetha Govindam beats Akshay Kumar’s Gold and John Abraham’s Satyameva Jayate in Australia

English Title
Vijay Deverakonda’s Geetha Govindam beats Akshay Kumar’s Gold and John Abraham’s Satyameva Jayate in Australia

MORE FROM AUTHOR

RELATED ARTICLES