కెఎల్‌ఎమ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ

Submitted by lakshman on Tue, 09/19/2017 - 19:10

ఒక్క చాన్స్ వస్తే నేనేంటో నిరూపించుకుంటానంటూ ఫిల్మ్ నగర్‌లో చెప్పులరిగేలా తిరిగే వాళ్లు ఈరోజుకూ ఉన్నారు. టాలీవుడ్‌లో చాలామంది ఆ ఒక్క చాన్స్ వల్లే ఈరోజు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్నారు. ఎన్ని సినిమాలు తీసే సత్తా ఉన్నా ఒక్క హిట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎన్నటికీ గుర్తింపు రాదు. ఆ ఒక్క హిట్ పడితే ఆ హీరో రేంజే మారిపోతుంది. టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో అలా ఎదిగిన హీరో ఎవరైనా ఉన్నాడా అనే ప్రశ్నకు విజయ్ దేవరకొండ అని టక్కున సమాధానమొస్తుంది. పెళ్లిచూపులు సినిమాకు ముందు ఎన్ని సినిమాల్లో నటించినా విజయ్‌కు ఆశించిన గుర్తింపు రాలేదు. నానితో పాటు ఎవడే సుబ్రమణ్యం సినిమా ఫంక్షన్ కోసం ఓ కాలేజీకి వెళితే నానికి పుష్ఫగుచ్చం ఇచ్చి విజయ్‌కు ఇవ్వలేదంటే అప్పుడు తనకిచ్చిన గుర్తింపేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇప్పుడు విజయ్ రేంజ్ మారింది.

పెళ్లి చూపులు సినిమా విజయ్‌ను హీరోగా నిలబెడితే.. అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్‌‌లో దేవరకొండ విజయ్‌ స్థానాన్ని పదిలపరిచింది. విజయ్ క్రేజ్ ఎంతలా పెరిగిందంటే.. ప్రముఖ కంపెనీలు తమ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించాలని ఈ యువ హీరో చుట్టూ తిరుగుతున్నాయి. విజయ్ కెఎల్‌ఎమ్ ఫ్యాషన్ మాల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ క్వాన్ తెలిపింది. ఇంకా పలు ప్రముఖ కంపెనీలు విజయ్ కోసం క్యూ కట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దక్షిణాదిలో హీరో విజయ్ కూడా కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఎంచుకునే జాబితాలో ఒకడిగా నిలిచాడు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్‌ను కూడా పెంచినట్లు సమాచారం. విజయ్ కూడా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా.. క్రేజ్ ఉన్నప్పుడే దాన్ని క్యాష్ చేసుకోవాలన్న ఆలోచనలో పడ్డాడనడంలో సందేహం లేదేమో.

English Title
Vijay Deverakonda Cruises Ahead As Most Wanted 'Brand Ambassador'

MORE FROM AUTHOR

RELATED ARTICLES