రామన్నా కంగ్రాట్స్: హీరో విజయ్ దేవరకొండ..సరదాగా రిప్లై ఇచ్చిన కేటీఆర్

Submitted by arun on Mon, 12/18/2017 - 13:15
vijay devarakonda minister ktr

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ‘లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా అవార్డు అందుకోబోతున్నారు. భారతదేశ అతిపెద్ద మ్యాగజైన్‌ అయిన ‘బీడబ్ల్యూబీ బిజినెస్‌ వరల్డ్‌’ ఈ అవార్డును ప్రకటించింది. డిసెంబర్‌ 20న దేశ రాజధాని దిల్లీలో జరగనున్న ఐదో జాతీయ స్మార్ట్‌ సిటీ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్‌ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా కేటీఆర్ కు అభినందనలు తెలియజేశాడు. "రమనన్నా, లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైనందుకు కంగ్రాట్స్. మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటున్నా... ఎందుకంటే సుదీర్ఘ కాలం మీరు మాకు అవసరం" అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సమాధానంగా కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. "థ్యాంక్స్ అర్జున్ రెడ్డి... ఇప్పుడు మిమ్మల్ని గారు అంటే బాగుండదేమో" అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు.

English Title
vijay devarakonda says congrats to ktr

MORE FROM AUTHOR

RELATED ARTICLES