ఐ యామ్ బ్యాక్.. దుమ్మురేపుతోన్న విజయ్ దేవరకొండ!

Submitted by arun on Fri, 02/09/2018 - 11:31
Vijay Devarakonda

‘పెళ్ళిచూపులు’ సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ క్రేజ్ ‘అర్జున్‌రెడ్డి’తో అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న యువ హీరోల్లో ఒకడిగా మారపోయాడు విజయ్. ‘అర్జున్‌రెడ్డి’ బ్లాక్‌బస్టర్‌తో విజయ్ కోసం నిర్మాతలు క్యూ కట్టారు. ఒక్క సినిమాతో సాధించిన క్రేజ్‌ను కాపాడుకోవడానికి విజయ్ చాలా జాగ్రత్తగా కథలు ఎంచుకున్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. అందులో ఓ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇట్స్‌ టైమ్‌.. ఐ యామ్‌ బ్యాక్‌... అంటూ విజయ్‌ దేవరకొండ తన ట్విటర్‌లో ఈ చిత్ర ప్రీలుక్‌ పోస్టర్‌ను ఉంచాడు. దుమ్ము రేపుతున్న టాక్సీ పోస్టర్‌ కింద ‘ఫస్ట్‌ లుక్‌ ను ఏదో ఒక రోజు విడుదల చేస్తాం’ అన్న క్యాప్షన్‌ కింద కనిపిస్తోంది. రాహుల్ సంకృత్యన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ క్యాబ్‌ డ్రైవర్‌ రోల్‌లో కనిపించబోతుండగా.. షార్ట్‌ ఫిలింస్‌ బ్యూటీ ప్రియాంక జవల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆసక్తికర టైటిల్‌ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

It's time.
I am back. pic.twitter.com/2jQMmMr926

— Vijay Deverakonda (@TheDeverakonda) February 9, 2018

English Title
vijay devarakonda next pre look poster out

MORE FROM AUTHOR

RELATED ARTICLES