మోస్ట్ అవైటెడ్ సినిమాల షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?

మోస్ట్ అవైటెడ్ సినిమాల షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
x
Highlights

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది ఆసక్తి గా ఎదురుచూస్తున్న సినిమాలు బోలెడు ఉన్నాయి. మరి వారి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూసేద్దామా? ఎన్టీఆర్, రామచరణ్...

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది ఆసక్తి గా ఎదురుచూస్తున్న సినిమాలు బోలెడు ఉన్నాయి. మరి వారి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూసేద్దామా? ఎన్టీఆర్, రామచరణ్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఆర్ ఆర్ ఆర్` సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది. సినిమాలోని ప్రధాన తారాగణం మొత్తం ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారని సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి ముఖ్యపాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' షూటింగ్ ఈరోజు నుంచి జమ్మలమడుగులో మే 9 వరకు జరుగుతుంది. మే 10 నుంచి వికారాబాద్ లో 13 వరకు షూటింగ్ చేయనున్నారు. అలాగే 13 నుంచి 20 వరకు దండు మైలారం లో షూటింగ్ చేస్తారు. దీంతో మొత్తం షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.

విక్టరీ వెంకటేష్ నాగచైతన్య హీరోలుగా రాబోతున్న మల్టీ స్టారర్ 'వెంకీ మామ'. షూటింగ్ ఈనెల 15 నుంచి హైదరాబాద్ లో జరుగనుంది. మరోవైపు నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రాబోతున్న 'వి' సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. కొన్ని సినిమాల షూటింగ్ మాత్రం ఔట్ డోర్ లో జరుగుతున్నాయి. 'ఆర్ ఎక్స్100' ఫేమ్ కార్తికేయ-అర్జున్ జంధ్యాల 'గుణ 369' సినిమా షూటింగ్ ఒంగోలు లో జరుగుతోంది. రాజ్ తరుణ్ జి.ఆర్. కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న 'ఇద్దరి లోకం ఒకటే' షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. శర్వానంద్, సమంత జంటగా తమిళ సినిమా '96' రీమేక్ కెన్యాలో తెరకెక్కుతోందని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories