భవానీ భక్తులకు కేశినేని రమేశ్‌ టోకరా

Submitted by arun on Fri, 07/13/2018 - 14:44
Kesineni Ramesh

బెజవాడలో భవానీ భక్తులకు కేశినేని రమేశ్ అనే వ్యక్తి కోటి రూపాయలకు పైగా టోకరా వేశారు. నూజివీడులో వంద ఎకరాల భూమి ఉందని భవానీ భక్తులను నమ్మించాడు కేశినేని రమేశ్‌. డాక్యుమెంట్లు చూపించి అఖిల భారత భవానీ గురుపీఠం నుంచి విడతల వారీగా కోటి రూపాయలకు పైగా వసూలు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కేశినేని రమేశ్‌పై పలు కేసులు ఉన్నాయ్. జైలు శిక్ష సైతం అనుభవించారు. న్యాయశాఖ విభాగంలో పని చేసిన కేశినేని రమేశ్‌ వ్యవహారశైలి సరిగా లేకపోవడంతో సస్పెండ్ చేశారు. తాజాగా భూముల విక్రయంతో పేరుతో కోటి రూపాయలు మోసం చేయడంతో బాధితులు సీఎం యాప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.

English Title
Victim's complaint on Kesineni Ramesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES