మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ తో జాగ్ర‌త్త

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ తో జాగ్ర‌త్త
x
Highlights

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ వినియోగించేవారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని బ్యాంకు అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. దాదాపు 232 బ్యాంకులే ల‌క్ష్యంగా నుట్రోజ‌న్...

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ వినియోగించేవారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని బ్యాంకు అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. దాదాపు 232 బ్యాంకులే ల‌క్ష్యంగా నుట్రోజ‌న్ మాల్వేర్ అనే వైర‌స్ దాడి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 12 బ్యాంకుల ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లకు సెక్యూరిటీ ముప్పు ఉన్న‌ట్లు సైబర్ భద్రతా సంస్థల్లో ఒకటైన క్విక్ హీరో సెక్యూరిటీ ల్యాబ్స్ గుర్తించింది.
క్విక్ హీల్ తన జాబితాలో చెప్పబడిన భారత బ్యాంకులు ఏవంటే.. హెచ్డీఎఫ్‌సీ, యాక్సిస్ మొబైల్, ఐసీఐసీఐ బ్యాంక్ ఐ మొబైల్, ఐడీబీఐ బ్యాంగ్ గో మొబైల్ ప్లస్, ఐడీబీఐ బ్యాంక్ అభయ్, ఐడీబీఐ బ్యాంక్ గో మొబైల్, ఐడీబీఐ ఎంపాస్ బుక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎం పాస్ బుక్, యూనియన్ బ్యాంకు, యాక్సిస్ మొబైల్ వంటి యాప్స్ వున్నాయి. కస్టమర్ల లాగిన్ వివరాలను కాజేసేందుకు కస్టమర్లకు వచ్చే ఎస్ఎంఎస్‌లను హైజాక్ చేసేందుకు ఆండ్రాయిడ్ బ్యాంకర్ ఏ9480 పేరుతో పిలిచే మాల్వేర్‌‍ను డిజైన్ చేసినట్లు క్విక్ హీరో గుర్తించింది. నకిలీ ఫ్లాష్ ప్లేయర్ యాప్ ద్వారా ఈ మాల్వేర్ చొరబడుతున్నట్టు తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories