అంగరంగ వైభవంగా హనుమాన్‌ శోభాయాత్ర

అంగరంగ వైభవంగా హనుమాన్‌ శోభాయాత్ర
x
Highlights

తెలంగాణవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వీహెచ్ పీ, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని గౌలిగూడ...

తెలంగాణవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వీహెచ్ పీ, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని గౌలిగూడ రామ్‌మందిర్‌ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర తాడ్‌బండ్‌ ఆంజనేయస్వామి దేవాలయం వరకు కొనసాగింది. సికింద్రాబాద్ లోని తాడ్బంద్ ప్రఖ్యాత హనుమాన్ ఆలయానికి భక్తులు పొటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

వరంగల్ జిల్లా డోర్నకల్ ప్రాంతంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. యువకులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఉత్సాహంతో ఉరకలేస్తూ హనుమాన్ నామస్మరణ చేశారు. జై శ్రీరాం జై హనుమాన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లా పటాన్ చెరులో హనుమాన్ శోభాయాత్ర ఉత్సవంగా సాగింది. ఈ యాత్రలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. శోభాయాత్రలో పాల్గొన్నవారికి ముస్లిం యువకులు మజ్జిగ ఇచ్చి సోదర భావం చాటుకున్నారు.

నిజామాబాద్ నగరం కాషాయవనంలా మారింది.. హనుమాన్ నామ స్మరణ తో నగరం మారుమోగింది.హనుమాన్‌ జయంతిని పురస్కరించికుని భజరంగ్‌దళ్‌, విశ్వహిందూ పరిషత్‌ సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ నుంచి వీరహనుమాన్‌ విజయయాత్ర ప్రారంభించారు.ఆంజనేయుడు, శ్రీరాముడు, శివుడు, దత్తాత్రేయుడు, భరతమాత, ఛత్రపతి శివాజీ విగ్రహాలను నగర వీధుల గుండా గోల్‌హనుమాన్‌ వరకు ఊరేగించారు. జైహనుమాన్ నినాదాలతో యువకులు హోరెత్తించారు. తెలంగాణలో ఇతర చోట్ల కూడా హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. జై హనుమాన్ నినాదాలతో యువకులు ఉత్సాహంగా హనుమాన్ జయంత్రి వేడుకల్లో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories