త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పణ..త్వరలోనే

త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పణ..త్వరలోనే
x
Highlights

తెలంగాణలో కలకలం రేపుతున్న ఇంటర్ ఫలితాల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఎట్టకేలకు నివేదిక సమర్పించింది. ఇంటర్ ఫలితాల్లో...

తెలంగాణలో కలకలం రేపుతున్న ఇంటర్ ఫలితాల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఎట్టకేలకు నివేదిక సమర్పించింది. ఇంటర్ ఫలితాల్లో అవకతకవలు, గ్లోబరీనా సంస్థపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆద్యయనం చేసిన కమిటీ పది పేజిల నివేదిక ప్రభుత్వానికి అందచేసింది. విచారణలో తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని ప్రభుత్వం పరిశీలించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని త్రిసభ్య కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలపై గందరగోళం నేపథ్యంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించింది. ప్రభుత్వానికి 10 పేజీల నివేదికను, 15 అంశాలతో కూడిన నివేదికను త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి అందజేసింది. అందజేశారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై విచారణ చెయ్యడంతోపాటు భవిష్యత్ లో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తూ నివేదిక ఇచ్చినట్లు కమిటీ ఛైర్మన్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని ప్రభుత్వం పరిశీలించిన తర్వాత నివేదిక పూర్తి వివరాలు తెలియచేస్తామన్నారు.

ఇంటర్ ఫలితాలపై త్రిసభ్య కమిటీ నివేదిక అందించిందని ప్రభుత్వం పరిశీలించిన తర్వాతనే తగిన తీసుకుంటామని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీతో జనార్ధన్ రెడ్డి సమావేశమయ్యారు. ఇంటర్‌ ఫలితాలపై త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికను అందచేశారు. నివేదికలోని అంశాలు పరిశీలించి త్వరలోనే యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని జనార్ధన్ రెడ్డి తెలిపారు. గందరగోళానికి బాధ్యులైన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరో వైపు ఇంటర్‌ ఫలితాల్లో తలెత్తిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ చెప్పారు. సప్లిమెంటరీ ఫలితాలకు ముందే రీ వెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ఫలితాలు వెల్లడిస్తాం. 12 కేంద్రాల్లో రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్లను జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇంటర్‌ ఫలితాల ప్రక్రియపై సమగ్ర దర్యాప్తు చేసిన త్రిసభ్య కమిటీ నివేదికను నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాస్ అయిన విద్యార్ధులు కూడా తక్కువ మార్కులు వచ్చాయని తమ ఫలితాలు కూడా ఉచితంగా రీ వెరిఫికేషన్ చేయాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories