ఎంపీ ఇంట్లో ఉపరాష్ట్రపతి బూట్లు మాయం

Submitted by arun on Fri, 01/19/2018 - 16:50
Venkaiah Naidu

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొన్ని అధికారిక కార్యక్రమాల నిమిత్తం నేడు బెంగళూరులో పర్యటిస్తున్నారు. వెంకయ్యనాయుడుకు నగరంలో వింత అనుభవం ఎదురైంది. ఓ ఇంటికి అతిథిగా వెళ్లి..తిరిగొచ్చేలోపు వేసుకున్న బూట్లు మాయమైపోయాయి. దీంతో వెంకయ్య ఒకింత అసహనానికి గురయ్యారు. నిత్యం జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే వెంకయ్యనాయుడు. తీరా ఆయన బూట్లే పోవడంపై ఖాకీలు తలలు పట్టుకున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి బెంగళూరు వెళ్లిన వెంకయ్య..కేంద్రమంత్రులు సదానందగౌడ, అనంత్‌కుమార్‌లతో కలిసి ఎంపీ పీసీ మోహన్ ఇంట్లో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం వెంకయ్య బయటకొచ్చేసరికి షూస్ కనిపించలేదు. సిబ్బంది, ఇతర వ్యక్తులు ఎంత వెతికినా దొరకలేదు. దీంతో వెంకయ్యనాయుడు భద్రతాసిబ్బంది సమీపంలోని చెప్పుల దుకాణానికి వెళ్లి మరో జత పాదరక్షలు తీసుకొచ్చారు.

English Title
Venkaiah Naidu footwear went missing

MORE FROM AUTHOR

RELATED ARTICLES