క్రిస్మ‌స్‌కి 'వేలైకార‌న్'

క్రిస్మ‌స్‌కి వేలైకార‌న్
x
Highlights

'త‌ని ఒరువ‌న్' వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నత‌మిళ‌ చిత్రం 'వేలైకార‌న్‌'. త‌క్కువ కాలంలోనే క్రేజీ హీరోగా పేరు...

'త‌ని ఒరువ‌న్' వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నత‌మిళ‌ చిత్రం 'వేలైకార‌న్‌'. త‌క్కువ కాలంలోనే క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న శివ‌కార్తీకేయ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాని క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ చేయనున్నామ‌ని చిత్ర బృందం అధికారికంగా పేర్కొంది. 'త‌ని ఒరువ‌న్' చిత్రం తెలుగులో 'ధృవ‌'గా రూపొంది విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories