పోయిందా...జారిపోయిందా?

పోయిందా...జారిపోయిందా?
x
Highlights

దేవునికి సంబంధించిన ఆభరణాలకు భద్రత కరువైంది. మొన్న గోవిందుని కిరీటం మాయమైంది. దాని ఆచూకీ తెలిసిందో లేదో భగవంతుడికే తెలియాలి. ఇపుడు తాజాగా బాసర...

దేవునికి సంబంధించిన ఆభరణాలకు భద్రత కరువైంది. మొన్న గోవిందుని కిరీటం మాయమైంది. దాని ఆచూకీ తెలిసిందో లేదో భగవంతుడికే తెలియాలి. ఇపుడు తాజాగా బాసర అమ్మవారి కిరీటంలో వజ్రం మాయమైందన్న వార్తలు భక్తుల్ని ఆందోళనలో పాడేస్తున్నాయి.నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ దేవాలయం. సరస్వతీ మాత ఆలయం. ఇక్కడ అమ్మవారి మూలవిరాట్ పైనున్న మకుటంలో ఓ అపురూప వజ్రం మాయమైందని తెలుస్తోంది. నవరత్నాలతో రూపొందించిన కిరీటాన్ని హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు పది సంవత్సరాల క్రితం అమ్మవారికి కానుకగా ఇచ్చారు. ఇపుడు ఆ కిరీటం లోని ఓ వజ్రం కనిపించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని ఆలయ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఆలయ అర్చకులు మాత్రం ఈ విషయంలో వేరేరకంగా స్పందిస్తున్నారు. అమ్మవారికి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తుంటామనీ ఈ క్రమంలో కిరీటం ఆరిగిపోయి.. వజ్రం జారిపోయుంటుందని చెబుతున్నట్టు భక్తులు చెప్పారు. ఇపుడు ఈ వ్యవహారం పట్ల భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిజానిజాలు వెలికి తీయాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories