పెళ్లి కొడుకు అద్దెకివ్వబడును!

పెళ్లి కొడుకు అద్దెకివ్వబడును!
x
Highlights

ఇదేమి విడ్డూరం.. ఇల్లు అద్దెకివ్వబడును అని చదివా గాని.. పెళ్లి కొడుకు అద్దెకివ్వబడును అనేది.. నేనక్కడ వినలేదని అలోచిస్తున్నారా.? మీరు చదువుతున్నది...

ఇదేమి విడ్డూరం.. ఇల్లు అద్దెకివ్వబడును అని చదివా గాని.. పెళ్లి కొడుకు అద్దెకివ్వబడును అనేది.. నేనక్కడ వినలేదని అలోచిస్తున్నారా.? మీరు చదువుతున్నది నిజం. అక్కడ పెళ్లికొడుకుని అద్దెకు తెచ్చుకొవచ్చు. ఇంతకీ ఎక్కడ అని అనుకుంటున్నారా.. మన దగ్గర కాదులేండి.. వియత్నాంలో ప్రస్తుతం కనిపిస్తోన్న పరిస్థితి ఇది. మన దగ్గర అద్దెఇల్లు వ్యాపారం ఎలా అయితే జరుగుతుందో.. అక్కడ పెళ్లికొడుకుల్ని అద్దెకిచ్చే బిజినెస్ అలా జరుగుతుంటుంది.

పెళ్లికి ముందే తల్లయ్యే యువతుల సంఖ్య ఏటా పెరుగుతుడటంతో అక్కడ ఈ వ్యాపారం పుట్టుకొచ్చింది. యువతులు పెళ్లికి ముందే తొందరపడటంతో.. అక్కడ నకిలీ పెళ్లిళ్లూ పెరుగుతున్నాయి. ఫలితంగా అలాంటి పెళ్లిళ్లు చేసే వ్యాపారమూ విస్తరిస్తోంది. వియత్నంలో అబార్షన్ల సంఖ్య ఎక్కువ. గతేడాది అధికారికంగా 3లక్షలకు పైగా అబార్షన్లు నమోదయ్యాయి. పెళ్లికిముందే కొన్ని జంటలు ఇళ్లు అద్దెకు తీసుకొని కలిసుంటున్నారు. దాంతో అవాంఛిత గర్భాల సంఖ్యా పెరుగుతోంది.

తొందరపడి తప్పు చేసి.. తరువాత చాలామంది యువతులు భయపడుతున్నారు. అలాంటి వారి భయాన్ని కొన్ని సంస్థలు వ్యాపార అవకాశంగా మార్చుకుంటున్నాయి.

నకిలీ పెళ్లిళ్లు జరిపించి వారి సమస్యను గట్టెక్కిస్తున్నాయి. యువతులు కూడా వీరి సేవల్ని బాగా వాడుకుంటున్నారు. ఇలా డబ్బు తీసుకొని నకిలీ పెళ్లిళ్లు చేసే వ్యాపారం వియత్నాంలో బాగా విస్తరిస్తోంది. ఆ దేశంలో 15ఏళ్లు పైబడ్డ 70శాతం మంది పౌరులు పెళ్లయినవాళ్లే. దేశంలో సగం జనాభా 30ఏళ్ల లోపు వారే. అవాంఛిత గర్భాలతో పాటు సమాజానికి భయపడేవారి సంఖ్యా పెరుగుతుండటంతో.. వియత్నంలో నకిలీ పెళ్లిళ్ల ట్రెండ్ హవా నడుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories