డొనాల్డ్ ట్రంప్ కోడ‌లు కూల్చిన కాపురం

డొనాల్డ్ ట్రంప్ కోడ‌లు కూల్చిన కాపురం
x
Highlights

మూలిగే న‌క్క‌మీద తాటిపండుప‌డ్డ‌ట్లు ..ఇప్పుడు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోడ‌లి రూపం లో పెద్ద ఎదురు దెబ్బే త‌గిలింద‌ని అమెరికా మీడియా...

మూలిగే న‌క్క‌మీద తాటిపండుప‌డ్డ‌ట్లు ..ఇప్పుడు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోడ‌లి రూపం లో పెద్ద ఎదురు దెబ్బే త‌గిలింద‌ని అమెరికా మీడియా క‌థ‌నాల్ని ప్ర‌సారం చేస్తోంది.
అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్ట‌క‌ముందు సామాన్యుడిగా ఉన్న ట్రంప్ అనేక మంది మ‌హిళ‌ల‌తో వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగించారు. అవి భ‌య‌ట‌కు పొక్క‌కుండా పెద్ద‌మొత్తంలో న‌గ‌దు చెల్లించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే.
సామాన్య పౌరుడిగా ఉన్న ట్రంప్ ప‌లువురు స్త్రీల‌తో శారీర‌క సంబంధాన్ని నెరిపారు. ఆ త‌రువాత అధ్య‌క్ష ప‌ద‌వి పోటీ చేయాల‌నే ఉద్దేశంతో ..తాను స‌న్నిహింతంగా ఉన్న మ‌హిళ‌లంద‌రిని దూరం చేశాడు. ట్రంప్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెల‌వ‌గా..ఇప్పుడిప్పుడే ఇత‌ర స్త్రీల‌తో నెరిపిన అక్ర‌మ‌సంబంధాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.
గతంలో ట్రంప్ ఓ శృంగార తార వెంటపడ్డారు. ఆమె పేరు స్టెఫానీ క్లిఫోర్డ్‌. అమెరికాలో పేరు ఉన్న పెద్ద పోర్న్‌ స్టార్‌. ఆమెతో ఒకటి రెండు సార్లు ఆయన తన ప్రేమాయణం కొనసాగించారు. కాలిఫోర్నియాలో 2006లో లేక్‌ తహో గెస్ట్‌హౌస్‌ వద్ద మూడోసారి కలిశారు. అది కూడా మెలీనియాను మూడో భార్యగా చేసుకున్న ఏడాదిలోగానే! ఈ వ్యవహారాలు చాలా సార్లు బయటకు పొక్కాయి కూడా.
తన లాయర్‌ మైఖేల్‌ కోహెన్‌ ద్వారా లక్షా 30 వేల డాలర్లు (దాదాపు 83లక్షల రూపాయలు) ఆమెకు పంపి- ‘మన బంధంపై నోరెత్తవద్దు’ అని కోరారు. స్టెఫానీ ఆయన చెప్పినట్లే ఆయనతో సెక్స్‌ బంధంపై మౌనం దాల్చింది. కానీ ఈ చెల్లింపు మాత్రం బయటకు పొక్కింది. ట్రంప్‌ రసికత వెల గురించి వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఆ త‌రువాత కొద్దిరోజుల‌కి ట్రంప్ పోర్న్ స్టార్ స్టామీ డానియోల్ తో శారీర‌క సంబంధాన్ని కొన‌సాగించాడు. ఆ సంబంధాలు బ‌య‌ట‌కు పొక్క‌కుండా స్టామీకి పెద్ద‌మొత్తంలో డ‌బ్బులు ముట్ట‌జెప్పార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే వార్త‌ల్ని వైట్ హౌస్ వ‌ర్గాలు ఖంఢించాయి. ఈ నేప‌థ్యంలో స్టామీ డానియోల్ ఫ్రెండ్ , ప్ర‌ముఖ ఫోటోగ్రాఫ‌ర్ కెయిత్ మున్యాన్ ట్రంప్ శృంగార ర‌హస్యాల్ని బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు. ఓ టీవీ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన కెయిత్ ట్రంప్ - స్టామీల బంధం ఎలాంటిదో చెప్పాడు.
తాను లాస్ ఎంజెల్స్‌లోని లోయ ప్రాంతంలో డానియెల్ తో క‌లిసి రెండేళ్ళపాటు ఉన్నానని మున్యాన్ చెప్పారు. అదే స‌మ‌యంలో 2006లో ట్రంప్‌ తొలిసారిగా డానియెల్‌తో మాట్లాడాడని ఆయన చెప్పారు. ట్రంప్ మాట‌లు చాలా విచిత్రంగా ఉండేవ‌ని ..శారీర‌క సంబంధాన్ని నెరిపేందుకు ఉత్స‌హం చూపించిన ట్రంప్ డానియోల్ కి ఫోన్ చేసి అప్పుడప్పుడు త‌న ప్ర‌ప్రోజ్ ను ముందుంచే వాడ‌ని , కానీ డానియోల్ అందుకు ఒప్పుకునేది కాదు. చివ‌రికి అయితే చివరికి ట్రంప్‌తో డానియెల్‌కు మధ్య శారీరక సంబంధం కుదిరిందని చెప్పారు. వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉన్న విషయం వాస్తవమేనని ఆయన తేల్చి చెప్పారు.
ఇంకో విష‌యం ఏంటంటే ట్రంప్ కు డ్రెస్ లు వేసుకోవ‌డం చేత‌కాద‌ని, పార్టీల‌కు వెళ్లిన‌ప్పుడు ఆయ‌న డ్రెస్ ల‌ను డానియెల్ స‌రి చేసేద‌ని చెప్పాడు. ఇక ఒప్పందం విషయంపై మాత్రం పూర్తి వివరాలు వెల్లడించలేనని మున్యాన్ ఆ ఛానెల్‌కు చెప్పారు. వీట‌న్నింటిపై విచార‌ణ కొన‌సాగుతుండ‌గా తాజాగా ట్రంప్ పెద్ద కొడుకు ట్రంప్ జూనియ‌ర్ నుంచి విడాకులు కావాల‌ని అత‌ని భార్య వ‌నెస్సాహేడ‌న్ కోర్టును ఆశ్ర‌యించింది.
వ్యాపారంలో ఆరితేరిన ట్రంప్ అధ్య‌క్షుడ‌య్యాక ఆ వ్యాపారాల‌న్ని పెద్ద‌కొడుకు ట్రంప్ జూనియ‌ర్ కు అప్ప‌గించాడు. అయితే త్రండికంటే రెండాకులు ఎక్కువే చ‌దివిన ట్రంప్ జూనియ‌ర్ రియాల్టి , టెలివిజ‌న్ రంగాల్లో త‌న‌దైన పాత్ర‌పోషిస్తున్నాడు. అంతేకాదు జూనియ‌ర్ ట్రంప్ త‌న వ్యాపారాన్ని భార‌త్ కు విస్త‌రించాడు. ఇక్క‌డ రియాల్టి లో నిర్మాణాల్ని చేప‌డుతున్న‌విష‌యం తెలిసిందే. ఈ వ్యాపారంలో త‌లామున‌కైల‌న ట్రంప్ జూనియ‌ర్ కుటుంబాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అత‌ని భార్య మ‌న్ హ‌ట్ట‌న్ లోని కోర్టును ఆశ్ర‌యించింది. పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌, ఆస్తిపంప‌కాల కంటే ముందే త‌న‌కు విడాకులు మంజూరు చేయాల‌ని కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది.
ప్ర‌స్తుతం జూనియ‌ర్ డొనాల్డ్ ట్రంప్.. ట్రంప్ ఆర్గ‌నైజేష‌న్స్ లో ఎగ్జిక్యూటివ్ గా విధులు నిర్వ‌హిస్తున్నారు. అయితే ట్రంప్ జూనియ‌ర్ 2005లో మోడల్ అయిన వనెస్సా హేడన్‌ను పెళ్లాడారు. వీరికి ఐదుగురు పిల్లలు. అయితే తమకు వివాహమై 12 ఏళ్లు గడిచాయని, ఇప్పుడు వ‌నెస్సా హేడ‌న్ తో విడాకులు తీసుకునేలా నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు.
తాము విడిపోయినా ఒకరిని ఒకరం గౌరవించుకుంటామని తెలిపారు. తమకు ఐదుగురు అందమైన పిల్లలు ఉన్నారని, వారికి తామిచ్చే ప్రాధాన్యం ఎప్పటికీ అలాగే ఉంటుందని పేర్కొన్నారు. జూనియ‌ర్ ట్రంప్ కంటే అత‌ని భార్య వ‌నెస్సా కోర్టును ఆశ్ర‌యించ‌డం క‌ల‌క‌లం రేగింది. అయితే కోడ‌లి విడాకుల ప‌టిష‌న్ పై మామ ట్రంప్ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories