వల్లభనేని VS సుంకర

Submitted by arun on Thu, 07/26/2018 - 17:14
vs

ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పై ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు అయింది. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరుకు చెందిన పఠాన్ మరియంబీలు తమకు ఇవ్వవలసిన 90 వేల రూపాయలను సుంకర పద్మశ్రీ మోసం చేసింది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తప్పుడు ఫిర్యాదు, బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నించానిని సుంకర పద్మశ్రీ వాదిస్తున్నారు. ఈ కేసు వెనుక  ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. 

2016లో ఆత్కూరుకు చెందిన ప్రవీణ్ అనే రైతు డైరీ ఫామ్ లో మరియంబీ కుమారుడు మృతి చెందాడు. బాధితురాలి కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం ఇచ్చేందుకు ప్రవీణ్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒప్పుకున్నారు. తక్షణ సాయం కింద 10 వేలు రూపాయలు ఇచ్చారు. మిగిలిన 90 వేలు రూపాయలు సుంకర పద్మశ్రీకి ఇచ్చినట్లు ప్రవీణ్ చెప్పాడు. ఎంతకీ ఆ డబ్బులు సుంకర పద్మశ్రీ డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశానని మరియం బీ తెలిపారు. 

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. వల్లభనేని వంశీ అక్రమాలపై పోరాటం చేస్తున్నందుకే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. వల్లభనేని వంశీకి దమ్ముంటే తనకు రాజకీయంగా ఎదుర్కొవాలని సుంకర పద్మశ్రీ సవాల్ విసిరారు. 

సుంకరి పద్మశ్రీపై తాను కక్ష సాధించాల్సిన అవసరంలేదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టంచేశారు. ఓ మహిళకు సుంకరి పద్మశ్రీ డబ్బులు మోసం చేసిందని, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసు నమోదు వెనుక తన ప్రమేయంలేదని వల్లభనేని వంశీ తేల్చి చెప్పారు. 

English Title
Vallabhaneni Vamsi vs Padma Sri

MORE FROM AUTHOR

RELATED ARTICLES