మరో వివాదానికి తెరలేపిన యోగి ప్రభుత్వం

Submitted by arun on Tue, 04/10/2018 - 14:39

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుకు రాంజీని చేరుస్తూ వివాదం రేపిన యోగి ప్రభుత్వం కాషాయం కోటు ధరించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మరో వివాదానికి తెరలేపారు. బదౌన్‌లో దుండగులు కూలగొట్టిన అంబేద్కర్‌ విగ్రహాన్ని పున:ప్రతిష్టించిన అధికారులు రెగ్యులర్‌గా కనిపించే బ్లూకలర్‌ కోటు కాకుండా కాషాయ రంగు వేశారు. దాంతో దళితులు మళ్లీ ఆందోళన బాటపట్టారు. దళితవాదానికి సైతం బీజేపీ నేతలు కాషాయ రంగు పులిమారంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, బస్సులకు కాషాయరంగు వేసిన యోగి సర్కారు అంబేద్కర్ కు కూడా కాషాయ రంగు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌ బదౌన్‌ జిల్లా దుగరయ్యా గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని దుండగులు ధ్వంసంచేశారు. దాంతో దళితులు పెద్దఎత్తున నిరసనలు నిర్వహించారు. దళితుల ఆందోళనలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. దాంతో దిగొచ్చిన ప్రభుత్వం ఆగమేఘాల మీద మరో విగ్రహాన్ని తయారుచేయించి పున:ప్రతిష్టించింది. అయితే విగ్రహానికి కాషాయ రంగు వేయడంతో మళ్లీ వివాదం చెలరేగింది. దాంతో దళితులు మళ్లీ ఆందోళన బాటపట్టారు. అయితే ఈ వ్యవహారంలో తమ పార్టీ ప్రమేయం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. కాషాయ కలర్‌ అంబేద్కర్‌ విగ్రహంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదంటూనే కాషాయ వర్ణం భారతీయ సంస్కృతికి ప్రతీక అంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.

అంబేద్కర్‌ విగ్రహానికి కాషాయ రంగు వేయడంపై దళితులు మళ్లీ ఆందోళన బాటపట్టారు. యోగి ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే కాషాయ కలర్‌ మార్చాలంటూ డిమాండ్ చేశారు. అయితే అధికారులు స్పందించకపోవడంతో బీఎస్సీ నేతలు దగ్గరుండి మరీ అంబేద్కర్‌ విగ్రహానికి బ్లూకలర్ వేయించారు.

English Title
Uttar Pradesh government installs saffron statue of Ambedkar in Budaun village

MORE FROM AUTHOR

RELATED ARTICLES