నిజామాబాద్ లో గెలుపు ఎవరిది?

నిజామాబాద్ లో గెలుపు ఎవరిది?
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన లోక్ సభ నియోజకవర్గం నిజామాబాద్. మరో వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపధ్యంలో ఇక్కడ గెలుపు...

సార్వత్రిక ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన లోక్ సభ నియోజకవర్గం నిజామాబాద్. మరో వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపధ్యంలో ఇక్కడ గెలుపు ఎవరిదీ అన్నది చాలా ఉత్కంటగా మారింది . ఇక్కడినుండి 180 మందికి పైగా పోటిలో ఉండడంతో ఇక్కడ ఫలితాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి . ఇక బెట్టింగ్ బాబులు జోరుగా పందేలు కాస్తున్నారు కూడా ..

ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుండి సీఎం కుమార్తె సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో ఉన్నారు. ఇక బీజేపి అభ్యర్దిగా ధర్మపురి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ నుండి మధు యాష్కి పోటి చేసారు . వీళ్ళు మాత్రమే కాకుండా పసుపు , ఎర్రజొన్న రైతులు కూడా పోటిలో ఉన్నారు . ఇక్కడినుండి 180 మందికి పైగా పోటిలో ఉన్నప్పటికీ ప్రధానంగా మాత్రం టీఆర్ఎస్ ,బీజేపి , కాంగ్రెస్ మధ్యే త్రిముఖ పోటి నడుస్తుందని ముందుగా రాజకీయ విశ్లేషకులు భావించారు .

మొదటినుండి కవిత విజయం పక్కా అనుకున్నా అనూహ్యంగా ధర్మపురి అర్వింద్ పోలింగ్ నాటికీ పుంజుకున్నారని పోలింగ్ సరళిని బట్టి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు . ప్రధానంగా పోటి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపి అన్నట్టుగా సాగిందని ఇక కాంగ్రెస్ ఇక్కడ మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు .. ఇక ఇక్కడ మహిళల ఓటింగ్ శాతం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగింది. మహిళల ఓట్లు మాత్రమే తమకే పడ్డాయని ఇరు పార్టీల నేతలు అనుకుంటున్నారు . మరి మహిళలు ఎవరిని కరునించారో తెలియాలంటే మే 23 వరకు ఆగక తప్పదు .

Show Full Article
Print Article
Next Story
More Stories