నెల్లిమర్లలో గెలిచేదెవరు?

నెల్లిమర్లలో గెలిచేదెవరు?
x
Highlights

ఎండల వేడితోపాటు విజయనగరం జిల్లాలో ఎన్నికల ఫలితాల వేడి కూడా అంతకంతకూ రాజుకుంటోంది. మే నెల 23 ఎప్పుడు వస్తుందో, ఫలితాలు ఎప్పుడు వస్తాయోనని ఆతృత్తగా...

ఎండల వేడితోపాటు విజయనగరం జిల్లాలో ఎన్నికల ఫలితాల వేడి కూడా అంతకంతకూ రాజుకుంటోంది. మే నెల 23 ఎప్పుడు వస్తుందో, ఫలితాలు ఎప్పుడు వస్తాయోనని ఆతృత్తగా ఎదురుచూస్తున్నారు జిల్లా వాసులు. మరి నెల్లిమర్లలో గెలిచేదెవరు?

విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ పరిధిలో మొత్తం ఓటర్లు 2 లక్షల 831 మంది. అందులో లక్షా 76 వేల 266 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో 87 వేల 316 మంది మహిళలు ఓటేశారు. 88 వేల 987 మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా నియోజకవర్గంలో 87.79 శాతం ఓటింగ్ నమోదైంది.

నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పోలింగ్ శాతం పరిశీలిస్తే, నెల్లిమర్లలో 86.57 శాతం పోలింగ్ నమోదవ్వగా, పూసపాటిరేగ మండలంలో 88.67 శాతం, డెంకాడ మండలంలో 88.43 శాతం ఓటింగ్ అయ్యింది. బోగాపురం మండలంలో 87.68 శాతం పోలింగ్ సాగింది. దీంతో ఓటింగ్ సరళిని చూసుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు, గెలుపు తమదంటే తమదంటూ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో తామేమి తక్కువ కాదంటూ జనసేన అభ్యర్థి సైతం, విక్టరీ లెక్కలు వేసుకుంటున్నారు.

నెల్లిమర్ల నియోజకవర్గంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలతోపాటు జనసేన అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరిగా సాగిందనే చెప్పాలి. టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంఎల్ఎ పతివాడ నారాయణ స్వామి మరోసారి బరిలో నిలవగా, వైసీపీ నుండి బడ్డుకొండ అప్పలనాయుడు సై అన్నారు. వీరితోపాటు నియోజకవర్గంలో జనసేన నుండి మాధవి లోకం, తాను సిద్దమన్నారు. వీరితో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే నెల్లిమర్లలో ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థుల మధ్యే రసవత్తరంగా పోరు నడిచింది. అయితే ఎవరికివారే విజయం తమదేనంటున్నప్పటికీ, ఓటర్లు తమ తీర్పును, ఈవీఎం బాక్సుల్లో ఏమని నిక్షిప్తం చేశారో తెలియాలంటే, ఫలితాల వరకూ ఆగకతప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories