హైకమాండ్ దగ్గర ఉత్తమ్ పప్పులు ఉడకడం లేదా?

Submitted by santosh on Tue, 05/29/2018 - 11:13
UTTAM KUMAR REDDY

పదవుల భర్తీ విషయంలో టీపీసీపీ చీఫ్ ఇచ్చిన జాబితాను ఏఐసీసీ పక్కన పెడుతోందా..? అధిష్టానం దగ్గర తెలంగాణ కాంగ్రెస్ అధినేత హవా తగ్గిందా..? నిన్న మొన్నటి వరకు అధిష్టానం దగ్గర చక్రం తిప్పిన ఉత్తమ్.. పప్పులు ఉడకడం లేదా.....? టీపీసీసీ బాస్ స్వరం మారడానికి కారణాలేంటి.? టీ కాంగ్రెస్ అధినేతపై అధిష్టానానికి నమ్మకం సడలుతోందట. ఈ విషయం అంటోంది మరెవరో కాదు..స్వయానా ఆయనే. ప్రస్తుతం ఇదే చర్చ గాంధీభవన్‌లో జోరుగా సాగుతోంది. 

ఉత్తమ్‌లో నైరాశ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల టీపీసీసీ చీఫ్ సన్నిహితులతో చేసిన వాఖ్యలే ఇందుకు ఉదాహరణ. తెలంగాణ కాంగ్రెస్ గురించి తనకంటే జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే బాగా తెల్సని ఉత్తమ్ కుమార్ కొందరు మిత్రులతో అంటున్నారట. తనకు వ్యతిరేకంగా అటెండర్ మినహా అందరూ రాహుల్ కి ఫిర్యాదు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారట. అందుకే... తన ప్రమేయం లేకుండానే రాహుల్ పదవుల భర్తీ చేపట్టారంటూ ఉత్తమ్ వాపోతున్నట్లు సమాచారం.

భవిష్యత్తులో ప్రకటించాల్సిన కమిటీల జాబితాను ఇటీవల టీపీసీసీ అధినేత ఢిల్లీకి పంపించినా అధిష్టానం లైట్ తీసుకుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. వర్కింగ్ ప్రసిడెంట్స్, ప్రచార కమిటీ చైర్మన్, ప్రధాన కార్యదర్శి, మేనిపెస్టో కమిటీ, స్ట్రేటజీ కమిటీ, aicc కార్యదర్శులు, cwc పోస్ట్‌ల లిస్టును ఉత్తమ్ హైకమాండ్‌కు పంపితే రాహుల్..కేవలం జిల్లా అధ్యక్ష పదవుల లిస్టును మాత్రమే ఫైనల్ చేశారు. పైగా మిగతా పదవుల గురించి ఉత్తమ్.. రాహుల్ దగ్గర ప్రస్తావిస్తే...తాను చూసుకుంటానని చెప్పి పంపించి వేశారట. 

టీపీసీసీ చీఫ్ పంపిన జాబితాల కూర్పు సరిగా లేకపోవడం..సొంత వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే... రాహుల్.పలు పదవుల భర్తీ వాయిదా వేశారని సమాచారం. మరి వివిధ పదవులు, కమిటీల నియామకం పీసీసీ పంపిన జాబితాల ప్రకారం జరుగుతుందా..? ఉత్తమ్ అనుమానిస్తున్నట్లు మార్పులు చేర్పులు ఉంటాయా అనేది వేచి చేడాలి.

English Title
UTTAM KUMAR REDDY

MORE FROM AUTHOR

RELATED ARTICLES