ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది : టీడీపీ ఆరోపణ

ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది : టీడీపీ ఆరోపణ
x
Highlights

ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీ తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తామెంత చెప్పినా ఎన్నికల...

ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీ తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తామెంత చెప్పినా ఎన్నికల కమిషన్‌ వినిపించుకునే పరిస్థితిలో లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దేశంలో ఉన్నది భారత ఎన్నికల సంఘం కాదని బీజేపీ ఎన్నికల సంఘం అని టీడీపీ ఆరోపిస్తోంది.

చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌పై టీడీపీ ఆందోళనలు కంటిన్యూ చేస్తోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేస్తోంది. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన టీడీపీ ఆ కేంద్రాల్లో కనీసం ఫిర్యాదులు కూడా లేవని అవన్నీ టీడీపీకి కంచుకోట అని చెప్పుకొచ్చింది. ఈసీ వన్‌సైడ్‌గా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా సీఎం రమేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం మోడీ చెప్పు చేతుల్లో పని చేస్తోందని మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. ఎన్నికల సంఘం పని తీరుతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని తాము ఇచ్చిన ఫిర్యాదులను ఈసీ పట్టించుకోవడం లేదని అన్నారు. ఆనంద్‌బాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు అమరావతిలోని ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేశారు. ఈ ఐదింటితో పాటు మరో 8 చోట్ల రీ పోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈసీ పక్షపాత ధోరణిపై పార్లమెంట్‌ వేదికగా తమ పోరాటం కొనసాగుతుందని టీడీపీ స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories