అది శృంగారం కాదు...జస్ట్ టైంపాస్ : అమెరికా పోలీసుల విచారణలో తెలుగు నటి!

Submitted by arun on Fri, 06/15/2018 - 14:37
Tollywood sex racket

తెలుగు హీరోయిన్లను అమెరికాకు పిలిపించి, వారితో వ్యభిచారం చేయించిన కిషన్ కేసు విచారణను అమెరికా పోలీసులు వేగవంతం చేయగా, బాధితులు వారికి సహకరించడం లేదని తెలుస్తోంది. తనను భవిష్యత్తులో కాంటాక్ట్ చేయవద్దని కిషన్ ను వేడుకున్న ఓ నటిని అమెరికా పోలీసులు సంప్రదించగా, వ్యభిచారం చేసినట్టు ఆమె అంగీకరించలేదని సమాచారం. యూఎస్ కు తాను వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే, అక్కడ ఎవరితోనూ శృంగారం చేయలేదని, కాసేపు 'కాలక్షేపం' మాత్రమే చేశానని చికాగో పోలీసులకు స్పష్టం చేసిన ఆమె, తనకు కావాల్సిన సహాయం గురించి వారితో మాట్లాడానని చెప్పినట్టు తెలిసింది. ఈ కేసులో  కిషన్ నుంచి సేకరించిన వివరాలతో ఓ విటుడిని యూఎస్ పోలీసులు ప్రశ్నించగా, తొలుత వివరాలు చెప్పేందుకు అంగీకరించని అతను, చివరకు నిజం ఒప్పుకుంటూ, ఓ నటి కోసం తాను 1100 డాలర్లు (సుమారు రూ. 75 వేలు) చెల్లించానని అంగీకరించాడని సమాచారం. మరోవైపు తమ పేర్లు బయటకు వస్తే, పరువు పోతుందన్న భావనలో ఉన్న హీరోయిన్లు పోలీసుల విచారణకు సహకరించడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

English Title
US feds bust Tollywood sex racket in Chicago

MORE FROM AUTHOR

RELATED ARTICLES