విహార యాత్రలకు ఏపీ నేతలు

విహార యాత్రలకు ఏపీ నేతలు
x
Highlights

మండుటెండ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించిన నేత‌లు ఇప్పుడు విహార యాత్ర‌ల బాట ప‌ట్టారు. ప్ర‌త్య‌ర్ధి పార్టీలపై వాడి వేడి విమ‌ర్శ‌లు, ఆరోప‌ణలతో ఎన్నిక‌ల...

మండుటెండ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించిన నేత‌లు ఇప్పుడు విహార యాత్ర‌ల బాట ప‌ట్టారు. ప్ర‌త్య‌ర్ధి పార్టీలపై వాడి వేడి విమ‌ర్శ‌లు, ఆరోప‌ణలతో ఎన్నిక‌ల హీటు పెంచిన నేత‌లు ఎలక్షన్లు ముగియ‌డంతో విశ్రాంతి కోసం విదేశీ యాత్రలకు, విహారయాత్రలకు వెళ్తున్నారు. ఇప్పటికే వైసీసీ అదినేత జ‌గ‌న్ స్విట్జర్లాండ్ లో ఉండగా ఏపీ సీఎం చంద్రబాబు హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు.

ఏపీలో ఎన్నిక‌ల త‌రువాత పార్టీ గెలుపు ఓట‌ములు ఎన్నిక‌ల జ‌ర‌గిన తీరుని ఆంచ‌నా వేయ‌డంలో బీజీగా గ‌డిపిన నేత‌లు స్ర‌స్తుతం విహార యాత్ర‌ల కోసం విదేశాల‌కు వెళుతున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు రావడానికి ఇంకా సుమారు నెల రోజుల స‌మ‌యం ఉంది. దీంతో రిజల్ట్ వ‌చ్చే లోపు ఉన్న ఖాళీ స‌మ‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌తో గ‌డిపేందుకు నేతలు ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్ప‌టికే వైసీపీ ఆదినేత జ‌గ‌న్ కుటంభ సభ్యుల‌తో క‌ల‌సి స్విట్జ‌ర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. మ‌రోవైపు, ఇత‌ర రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించిన చంద్ర‌బాబు కూడా కుటుంభ స‌భ్యుల‌తో క‌ల‌సి మూడు రోజుల పాటు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కి విహార యాత్ర‌కు వెళ్లారు.

వైసీపీ ఆదినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే విదేశాల‌కు కుటుంభ స‌భ్యుల‌తో క‌ల‌సి వెళ్ల‌గా ఆ పార్టీ నేత‌లు సైతం తమ అదినేత బాట‌లోనే ప‌య‌నిస్తున్నారు. ఎన్నిక‌ల‌లో ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటి చేసిన నేత‌లు కుటంబ స‌భ్యులు, ప్రెండ్స్ తో క‌ల‌సి విహార యాత్ర‌కు వెళుతున్నారు. కొందరు నేత‌లు గోవా లాంటి ప‌ర్యాట‌క ప్రాంతాల్లో సేద తీర‌డానికి వెళ్లారు. ఇంకొందరు లండ‌న్, ఆమెరికా వంటి దేశాల‌కు వెళ్తున్నారు.

పార్టీనేత‌లు కోంద‌రు విహార యాత్ర‌కు వెళితే, మిగిలిన నేత‌లు మాత్రం నియోజ‌క వ‌ర్గాల‌లోనే ఉండి, పార్టీ క్యాడ‌ర్ తో మ‌మేకం ఆవుతున్నారు. గ‌త ఎన్నిక‌ల‌లో పార్టీ కోసం పని చేసిన కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌ని క‌లుస్తున్నారు. అస‌లే పెళ్లిళ్ళ సీజ‌న్ కావ‌డంతో పెళ్లిళ్లు, ఇత‌ర శుభ‌కార్యాల‌కు హాజ‌ర‌వుతూ బీజీగా గ‌డుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories