ఆ పాపం.. ఇంకా వెంటాడుతూనే ఉంది!

Submitted by arun on Wed, 03/28/2018 - 12:55
Trevor Chappell

చేసిన పాపం వెంటాడక మానదంటారు. జీవితం ఎంత బాగున్నా కూడా.. ఆ పాపపు ఫలితాన్ని అనుభవించక తప్పదని కూడా పెద్దలు చెబుతుంటారు. ఈ విషయం.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ట్రెవర్ చాపెల్ విషయంలో అక్షర సత్యం అయ్యింది. బాల్ టాంపరింగ్ వివాదంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్, క్రాఫ్ట్ లపై వేటు పడిన నేపథ్యంలో.. టాంపరింగ్ ను ప్రపంచానికి పరిచయం చేసిన గ్రెగ్ చాపెల్ సోదరుడు ట్రెవర్ చాపెల్ స్పందించాడు.

1981 వరల్డ్ కప్ ఫైనల్ లో ఇంగ్లండ్ పై అన్న గ్రెగ్ చాపెల్ సలహాతో అండర్ ఆర్మ్ బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించిన ట్రెవర్ చాపెల్.. లోకంతో మాత్రం ఛీ కొట్టించుకున్నాడు. నాడు తాను చేసిన ఆ పాపం.. ఇప్పటికీ వెంటాడుతోందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు స్మిత్, వార్నర్, క్రాఫ్ట్ ల పరిస్థితి కూడా అలాగే ఉంటుందని అన్నాడు. తను చేసిన తప్పు విషయంలో ఇప్పటికీ సిగ్గు పడుతూనే ఉన్నానని అన్నాడు.

“మ్యాచ్ అయితే గెలిచాం కానీ.. తర్వాత నా వైవాహిక జీవితం పూర్తిగా దెబ్బతింది. పెళ్లాం లేదు.. పిల్లలు లేరు. ఇన్నేళ్లూ గోల్ఫ్ ఆడుతూ గడిపేశా. పిల్లలకు క్రికెట్ పాఠాలు చెబుతూ కాలం గడిపేశా. ఇప్పటికీ చేసిన తప్పు గురించి నన్ను కొందరు ప్రశ్నిస్తూనే ఉంటారు. నా అన్న ఎన్ని విజయాలు సాధించాడో నాకు తెలియదు కానీ.. నేను మాత్రం చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తూనే ఉన్నా” అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు.. ట్రెవర్ చాపెల్.
 

English Title
'Underarm' bowler Trevor Chappell expects Steve Smith to be haunted forever

MORE FROM AUTHOR

RELATED ARTICLES