పవన్ పెళ్లాలపై వాళ్లే తేల్చుకోవాలి... జగ‌న్‌కు ఉండవల్లి కౌంటర్

Submitted by arun on Wed, 07/25/2018 - 17:43
undavalli

పవన్ కల్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి స్పందించారు. ఢిల్లీలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ లో ఈ విషయమై ప్రస్తావించగా ఉండవల్లి మాట్లాడుతూ, ‘పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యల వీడియో నేను చూడలేదు.. పేపర్ లో చూశా. ఇది చాలా తప్పు. అలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు జగన్‌కు లేదన్నారు. ఢిల్లీలో జరిగిన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు ఎందరు పెళ్లాలు అన్నది వారే తేల్చుకోవాలన్నారు. ఐపీసీ చాప్టర్ 28 ప్రకారం మరొకరు కామెంట్ చేయకూడదన్నారు. పవన్ కల్యాణ్ అన్న వాడికి ఎంతమంది పెళ్లాలు ఉన్నారనేది.. ఆ పెళ్లాలే తేల్చుకోవాలి తప్ప నీకూ నాకూ సంబంధం లేదని మన చట్టం చెబుతుంది. ఏ పెళ్లాన్ని అయితే ఇబ్బంది పెట్టారో ఆ పెళ్లాం కోర్టుకు వెళ్లొచ్చు. అంతేకానీ, మనకేమీ కామెంట్ చేసే అధికారం లేదు’ అని అన్నారు. ఇది పూర్తిగా రాజకీయాలను కలుషితం చేయడం కిందకే వస్తుందన్నారు. రాజకీయాలకు దానికి సంబంధం లేదన్నారు. వ్యక్తి అలవాట్లు చూసి ఓట్లు వేయరని.. ఆ వ్యక్తి వల్ల ఎంత వరకు మేలనే విషయం చూసి ఓట్లు వేస్తారన్నారు. ‘జగన్ ఎందుకిలా మాట్లాడుతున్నారు?' అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ఉండవల్లి స్పందిస్తూ, ‘జగన్ ఎందుకిలా చేశాడనేది చెప్పడానికి నాకు జ్యోతిష్య శక్తి లేదు. ఆ రకమైన వ్యాఖ్యలు చేసుకోవడం ఆ పార్టీకి గానీ, ఈ పార్టీకి గాని మంచిది కాదు’ అన్నారు

English Title
undavalli arun kumar respond on ys jagan comments on pawankalyan

MORE FROM AUTHOR

RELATED ARTICLES