ఏపీ ప్ర‌భుత్వానికి డెడ్ లైన్ విధించిన ప‌వ‌న్ క‌ల్యాణ్

Submitted by lakshman on Mon, 02/12/2018 - 01:35
Undavalli Arun Kumar Meets Pawan Kalyan at Jana Sena Party Office

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ప్రశాసన్ నగర్ లోని జనసేన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.  విభజన హామీల సాధనకు జేఏసీ ఏర్పాటు చేస్తానని చెప్పిన పవన్... అనంతరం సంయుక్త నిజ నిర్ధారణ సంఘం గురించి కూడా మాట్లాడిన సంగతి తెలిసిందే. కేంద్రం - రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో నిజానిజాలు తేల్చేందుకు వేస్తానన్న ఈ కమిటీ విషయంలోనే ఆయన ఉండవల్లితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వం తనతో అనుసరించిన తీరు - తన మాటలను లెక్క చేయకపోవడం కూడా ప్రస్తావించారు. పోలవరం నిధుల లెక్కను ఏపీ ఈ నెల 15లోగా వెల్లడించాలంటూ డెడ్ లైన్ విధించారు.
    
‘‘రాష్ర్ట ప్రభుత్వాన్ని పోలవరంపై శ్రేతపత్రం అడిగితే ఇవ్వలేదు.. వెబ్ సైట్ లో చూసుకోవాలని చెప్పింది. తీరా వెబ్ సైట్లోకి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ లేదు’ అని పవన్ చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో తాను కూడా అందరిలా బాధపడ్డానని దీనిపై రెండు మూడు సభలు కూడా పెట్టానని గుర్తు చేశారు. కేంద్ర - రాష్ర్ట ప్రభుత్వాలు చెబుతున్న మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న పవన్ .. ఇప్పుడు మాట్లాడుతున్న రాష్ర్ట ప్రభుత్వం ఇన్నాళ్లు ఎందుకు ఊరుకుందని ప్రశ్నించారు. ప్రజలకు న్యాయం చేయని ఈ రెండు పార్టీలను ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్న పవన్ .. అందుకే పార్టీలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేశానని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులెన్ని - ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులెన్ని వంటివన్నీ ఉండవల్లి - జేపీ వంటివారి సహాయంతో మథించి ప్రజల ముందుకెళ్తామన్నారు. రాష్ర్టం ఈ నెల 15లోగా పోలవరం లెక్కలు చెప్పాలన్నారు.
    
ఏపీకి మేలు జరుగుతుందనే గత ఎన్నికల్లో టీడీపీ - బీజేపీకి సపోర్టు చేశానని అన్నారు. నిధులు విషయంలో కేంద్ర - రాష్ర్టప్రభుత్వాలు చెబుతున్న మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.   న్యాయం చేయని రెండు పార్టీలను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు.
    
కాగా పవన్ తాజాగా వేస్తున్న అడుగులు - చెప్తున్న మాటలు ఆయన టీడీపీకి దూరం జరుగుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే.. పవన్ చాలా వ్యూహాత్మకంగా టీడీపీ వైఫల్యాలపై ప్రజలను బుజ్జగించే పనులు గతంలో చేసినందున ఇప్పుడు కూడా అలానే చేసినా చేయొచ్చన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. కానీ.. ఉండవల్లితో లెక్కలన్నీ తీయించిన తరువాత ఆయన టీడీపీకి అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు.

English Title
Undavalli Arun Kumar Meets Pawan Kalyan at Jana Sena Party Office

MORE FROM AUTHOR

RELATED ARTICLES