ఒకరు అబద్ధం చెప్తున్నారు : పవన్ కల్యాణ్

ఒకరు అబద్ధం చెప్తున్నారు : పవన్ కల్యాణ్
x
Highlights

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై.. జనసేనాని పవన్ కల్యాణ్ యాక్షన్ మొదలైంది. ఇక మిగిలింది వాళ్ల రియాక్షనే. విభజన హామీల అమలు కేంద్రం నిధులపై రెండు...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై.. జనసేనాని పవన్ కల్యాణ్ యాక్షన్ మొదలైంది. ఇక మిగిలింది వాళ్ల రియాక్షనే. విభజన హామీల అమలు కేంద్రం నిధులపై రెండు ప్రభుత్వాల్లో ఒకరు అబద్ధం చెప్తున్నారని పవన్ చెప్పారు. ఈ నెల 15 లోగా కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలను రాష్ట్రప్రభుత్వం తనకు ఇవ్వాలన్నారు. నిధుల లెక్కలు, ఖర్చుల వివరాలను కమిటీ పరిశీలించి వాస్తవాలు తేలుస్తుందన్నారు జనసేనాని.

విభజన హామీల అమలు, కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్న మాటలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. ఉండవల్లి అరుణ్ కుమార్‌తో ఆయన హైదరాబాద్‌లోని జనసేన ఆఫీస్‌లో నిన్న భేటీ అయ్యారు. విభజన హామీలపై ప్రజల మాదిరిగానే.. తనకూ గందరగోళం ఉందని చెప్పారు. పోలవరం లెక్కలపై.. ప్రభుత్వాన్ని శ్వేతపత్రం అడిగినా ఇవ్వలేదన్నారు పవన్. వాస్తవాలు వెలికితీయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల లెక్కలు తనకు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు పవన్ కల్యాణ్. నిధుల లెక్కలు ఖర్చులు, అప్పుల వివరాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరు అబద్ధం చెప్తున్నారన్నది కమిటీ తేలుస్తుందన్నారు. దీనికి సంబంధించి నిజనిర్ధారణ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు జనసేనాని.

జనసేనానిపై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పటి నుంచి పవన్ రియల్ పాలిటిక్స్ మొదలుపెట్టారన్నారు. పవన్ చేసేది పవర్ పాలిటిక్స్ కాదని పబ్లిక్ పాలిటిక్స్ అని చెప్పారు. విభజన హామీల అమలు సాధనలో పవన్ కచ్చితంగా సక్సెస్ అవుతారన్న నమ్మకం తనకుందని చెప్పారు.

ఇక సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లి అరుణ్ కుమార్ లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్‌తో భేటీ కానున్నారు. పవన్‌తో చర్చించిన అంశాలు జేపీతో పంచుకోనున్నారు. నిజనిర్ధారణ కమిటీలో ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories