అమెరికా భారత శాంతి వారధి

Submitted by arun on Fri, 08/17/2018 - 13:39
atal

భారత మాజీ ప్రధాని వాజ్‌పేయీ మృతిపట్ల,

అమెరికా బారతావనికి సంతాపం తెలిపింది,

ఇరు దేశాల అభివృద్ది, ప్రపంచశాంతి పట్ల, 

గొప్ప నేత కృషిని నేడు మరోసారి కొనియాడింది. శ్రీ.కో. 


భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మృతి పట్ల అమెరికా బారత దేశానికి సంతాపం తెలియజేసింది. భారత్‌, అమెరికాలు చక్కని భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఏనాడో గుర్తించిన నేతల్లో అటల్‌ ఒకరని అమెరికా కొనియాడింది. 2000 సంవత్సరంలోనే అటల్‌ అమెరికా కాంగ్రెస్‌ ఎదుట నిలబడి అమెరికా-భారత్‌ల మధ్య ఇరు దేశాల పరస్పర కృషితో సహజమైన భాగస్వామ్యం ఏర్పడాలని అన్నారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో వెల్లడించారు. అమెరికా, భారత్‌లు చక్కని భాగస్వామ్యం ఏర్పరుచుకుంటే అది ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికే కాకుండా ప్రపంచానికి కూడా ప్రయోజనకరం అని వాజ్‌పేయీ భావించారని, ఆయన ఆలోచనలే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడేందుకు దోహదపడ్డాయని పాంపియో ప్రశంసించారు. వాజ్‌పేయీ మరణం పట్ల తాను, అమెరికా ప్రజలంతా నివాళులర్పిస్తున్నామని, గొప్ప నేత ఎడబాటుతో కుంగిపోతున్న భారత్‌కు అమెరికా ప్రజలు అండగా నిలుస్తారని, భారత ప్రజలు తమ ఆలోచనల్లో ఉంటారని, వారి కోసం ప్రార్థిస్తున్నామని పాంపియో అన్నారు. ఇతర దేశాలతో స్నేహబంధం కోసం, ప్రపంచ శాంతి కోసం వాజ్పాయ్ ఎప్పుడు ముందుండేవారు.

English Title
From UK to Pakistan - Tributes Pour in from All Over for Vajpayee

MORE FROM AUTHOR

RELATED ARTICLES