కలెక్షన్ల జోరు చూపిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'

కలెక్షన్ల జోరు చూపిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్
x
Highlights

ఆఖరి నిమిషం వరకు అసలు ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అనే సస్పెన్స్ మెయింటైన్ చేసి ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్'...

ఆఖరి నిమిషం వరకు అసలు ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అనే సస్పెన్స్ మెయింటైన్ చేసి ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం నిన్న అనగా మార్చి 29న విడుదల విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విడుదల కాలేదు. ఇక విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. పైగా విడుదలకు ముందే బోలెడు వివాదాల్లో చిక్కుకోవడం వల్ల ఈ చిత్రానికి ప్రమోషన్లు భారీగానే దక్కాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా పైన అంచనాలు కూడా పెరిగిపోయాయి. అది సినిమాకు మరింత ప్లస్ అయింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఓవర్సీస్ లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. విడుదలకు ముందే చిత్ర ప్రమోషన్ల పుణ్యమా అని గురువారం రాత్రి వేసిన ప్రీమియర్ షో లో ఈ చిత్రం 90,214 డాలర్లను కలెక్ట్ చేయగా శుక్రవారం రాత్రి లోపు పదిన్నర లోపు సినిమా నమోదు చేసుకున్న కలెక్షన్లు ఏకంగా 55,714 డాలర్లు. గత కొంత కాలంగా ఒక్క హిట్ కూడా అందుకోలేని, రామ్ గోపాల్ వర్మ సినిమా ఈ రేంజ్ లో కాసులవర్షం కురిపించడం చూసి ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యానికి గురి అవుతున్నాయి. మొత్తానికి వర్మ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ అందుకొనే లాగానే ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories