కిడాంబీ శ్రీకాంత్‌కు లీ నింగ్ బ్రాండ్ జాక్ పాట్

కిడాంబీ శ్రీకాంత్‌కు లీ నింగ్ బ్రాండ్ జాక్ పాట్
x
Highlights

తెలుగుతేజం, భారత బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ స్టార్ ప్లేయర్ కిడాంబీ శ్రీకాంత్ పంటపండింది. చైనా స్పోర్ట్స్ బ్రాండ్ లీ నింగ్ తో నాలుగేళ్లకు 35 కోట్ల...

తెలుగుతేజం, భారత బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ స్టార్ ప్లేయర్ కిడాంబీ శ్రీకాంత్ పంటపండింది. చైనా స్పోర్ట్స్ బ్రాండ్ లీ నింగ్ తో నాలుగేళ్లకు 35 కోట్ల రూపాయల కాంట్రాక్టు కుదుర్చుకొన్నాడు. తన కెరియర్ లో ఇప్పటికే ఆరు సూపర్ సిరీస్ టైటిల్స్ తో పాటు...కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడల్ సాధించిన శ్రీకాంత్...వచ్చే నాలుగేళ్ళపాటు...ఏడాదికి ఎనిమిదిన్నర కోట్ల రూపాయల చొప్పున వివిధ రూపాలలో స్పాన్సర్షిప్ మనీ అందుకోనున్నాడు. చైనా, ఇండోనీషియా, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలజట్లతో పాటు...ఇండోనీషియా వేదికగా గత ఏడాది ముగిసిన ఆసియాక్రీడల్లో పాల్గొన్న భారత ఒలింపిక్స్ జట్టుకు సైతం...లీ నింగ్ బ్రాండ్... అధికారిక స్పాన్సర్ గా వ్యవహరించింది. 2020 టోక్యో ఒలింపిక్స్ వరకూ భారత బ్యాడ్మింటన్, క్రికెట్ జట్లతో పాటు అథ్లెట్లకు సైతం లీ నింగ్ అధికారక బ్రాండ్ గా ఉండనుంది. లీ నింగ్ లాంటి విశ్వవిఖ్యాత సంస్థకు, బ్రాండ్ కు ...బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికకావడం తన అదృష్టమని కిడాంబీ శ్రీకాంత్ పొంగిపోతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories