పొలంలో జులుం...ఇద్దరు మహిళలు కుస్తీపట్లు

Submitted by arun on Fri, 08/10/2018 - 17:38
Mahabubabad

పొలం విషయంలో ఇద్దరు మహిళలు కుస్తీపట్లు పట్టుకున్నారు. తన పొలం తనకు అప్పగించాలని యజమానురాలు కోరితే ముందు తమ అప్పు తీర్చాలంటూ కౌలుదారులు ఎదురు తిరిగారు. దీంతో పొలం యజమాని కౌలు మహిళ ఘర్షణ పడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాలలో జరిగింది.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాలకు చెందిన కల్యాణికి స్థానికంగా 4 ఏకరాల పొలం ఉంది. ఇంతకాలం ఆ భూమి వ్యవహారాలు ఆమె అన్నయ్య శ్రీనివాస రెడ్డి చూసేవాడు. ఇటీవల ఓ ప్రమాదంలో అతను మరణించడంతో కల్యాణి తన భూమిని అప్పగించాలని కౌలుదారులను కోరింది. అయితే ఆమె అన్నయ్య చేసిన 75 వేల అప్పును తీరిస్తే పొలం అప్పగిస్తామని  కౌలురైతులు షరతు పెట్టారు. దీంతో ఆమె కోర్టుకు వెళ్ళి స్టేటస్ కో ఆర్డర్ తెచ్చుకుంది. ఆ ఆర్డర్‌తో పొలం దగ్గరకు వచ్చిన కల్యాణి కుటుంబ సభ్యులపై కౌలుదారులు దాడికి పాల్పడ్డారు.

దాడి ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని బాధిత పొలం యజమాని కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. తమ అన్న చేసిన అప్పుకు సంబంధించిన పత్రాలు చూపించమంటే తమను తీవ్రంగా కొట్టారని వాపోయారు. తనకు ప్రాణహాని ఉందని కల్యాణి అంటోంది. అయితే దాడికి పాల్పడిన మహిళ వాదన మరోలా ఉంది. అసలు తాము సాగు చేస్తున్న పొలం కల్యాణిది కాదని ఆమె అన్న శ్రీనివాస రెడ్డిదని అంటోంది. అయినా తమ అప్పు చెల్లిస్తే భూమి అప్పగించేందుకు సిద్ధమని చెబుతోంది.

English Title
Two Women clash over Land Issue

MORE FROM AUTHOR

RELATED ARTICLES