కర్ణాటకలో నిఫా వైరస్ కలకలం : ఇద్దరి శరీరంలో వ్యాధి లక్షణాలు

Submitted by arun on Wed, 05/23/2018 - 15:08
virus

కేరళ రాష్ట్రాన్ని వణికిస్తున్న నిపా వైరస్ ఇపుడు కర్ణాటక రాష్ట్రానికి వ్యాపించినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, ఇద్దరు రోగుల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించినట్టు వైద్యులు చెపుతున్నారు. కేరళ సరిహద్దు ప్రాంతమైన మంగళూరులో గుర్తించినట్టు సమాచారం. ఇద్దరు వ్యక్తులకు నిఫా వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు బుధవారం(మే-23) కర్ణాటకకు చెందిన హెల్త్ అధికారి తెలిపారు. పూర్తి రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం వారి రక్త నమూనాలు మణిపాల్ పంపించాం అని.. నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తాం అని తెలిపారు. నిఫా వైరస్ లక్షణాలు కనిపిస్తున్న ఇద్దరిని.. ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

కేరళ నుంచి మంగళూరుకి వచ్చిన 20 ఏళ్ల యువతి, 75ఏళ్ల వ్యక్తిలో ఈ నిఫా వైరస్ ఉన్నట్లు డాక్టర్లు అనుమానిస్తున్నారు. లక్షణాలను గుర్తించాం.. రిపోర్ట్స్ తర్వాత అది నిఫా వైరస్సా కాదా అని తెలియజేస్తాం అంటున్నారు డాక్టర్లు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంగళూరు జిల్లా సర్వైవలెన్స్ అధికారి రాజేష్ తెలిపారు. నిఫా వైరస్ తో కేరళలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వైరస్ సోకిన వ్యక్తులకు ట్రీట్ మెంట్ చేస్తున్న సమయంలో ఈ వైరస్ సోకి లినీ అనే ఓ నర్సు కూడా చనిపోయింది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు వ్యక్తుల పూర్తి వైద్య పరీక్షల రిపోర్ట్ వచ్చే వరకు బయట తిరక్కుండా ఉంచినట్లు వెల్లడించారు.

English Title
Two suspected cases of Nipah virus reported from a second Indian state

MORE FROM AUTHOR

RELATED ARTICLES