ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. బాలికలదే హవా

ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. బాలికలదే హవా
x
Highlights

ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. తొలిసారిగా ఇంటర్ ఫలితాలు గ్రేడింగ్ విధానంలో ప్రకటించారు....

ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. తొలిసారిగా ఇంటర్ ఫలితాలు గ్రేడింగ్ విధానంలో ప్రకటించారు. ఫస్టియర్‌లో 60 శాతం, సెకండియర్‌లో 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మొదటి సంవత్సరంలో 81 శాతం, రెండో సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. మే 14 అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ జరగనుంది. ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 24న చివరి తేదీ అని తెలిపారు.

ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 27న మొదలై 18తో ముగిశాయి. కేవలం 24 రోజుల్లోనే ఫలితాలు విడుదలవ్వడం విశేషం. మొత్తం 10.17 లక్షల మంది విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోగా 9.65 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6.3 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణలు కాగా 3.3 లక్షల మంది ఫెయిలయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories