పీఎం మోడీ దావోస్ ప్ర‌సంగంపై ట్విట్ట‌ర్ రివ్యూ

పీఎం మోడీ దావోస్ ప్ర‌సంగంపై ట్విట్ట‌ర్ రివ్యూ
x
Highlights

స్విర్జ‌ర్లాండ్ దావోస్ లో వ‌ర‌ల్డ్ ఎకాన‌మిక్ ఫోరం 48వ వార్షికోత్స‌వ స‌మావేశం జ‌రిగింది. 1997లో అప్పటి ప్రధాని దేవెగౌడ తర్వాత.. మళ్లీ 20 ఏళ్లకు ప్రపంచ...

స్విర్జ‌ర్లాండ్ దావోస్ లో వ‌ర‌ల్డ్ ఎకాన‌మిక్ ఫోరం 48వ వార్షికోత్స‌వ స‌మావేశం జ‌రిగింది. 1997లో అప్పటి ప్రధాని దేవెగౌడ తర్వాత.. మళ్లీ 20 ఏళ్లకు ప్రపంచ ఆర్థిక వేదికపై భారత ప్రధాని మోడీ తొలిసారి ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా వరల్డ్ ఎకాన‌మిక్ ఫోరంను స్థాపించిన ష్వాబ్‌ను ప్రశంసించారు. ష్వాబ్ ఆర్థిక, రాజకీయ రంగాలను గట్టిగా ముడివేశారన్నారు. టెక్నాలజీ అభివృద్ధితో.. ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్న మోడీ..


వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు.. విశ్వం మనుగడకు సవాల్‌గా మారుతున్నాయ‌ని ఆందోళన వ్యక్తంచేశారు. భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని పున‌రుద్ఘాటించారు. ప్రపంచం ఉగ్రవాద స‌మ‌స్య యావత్‌ ప్రపంచానికి పెను సవాళ్లు విసురుతోందన్నారు. ప్రపంచ ఆర్థిక ప్రగతిలో మరింత క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories