ప్రియుడి కోసం భర్తను చంపిన నాగర్ కర్నూల్ స్వాతి: ఏ దిక్కూ లేక చివరికిలా...

Submitted by arun on Fri, 07/27/2018 - 13:14
nagar kurnool

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడి సాయంతో హత్యచేసిన నాగర్ కర్నూల్ మహిళ స్వాతి గురించి తెలిసిందే. భర్త సుధాకర్ రెడ్డిని హతమార్చడమే కాకుండా ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి భర్త స్థానంలోకి అతడిని తీసుకురావాలని పథకం వేసింది. కానీ అనూహ్యంగా గుట్టు బయటపడటంతో అడ్డంగా దొరికిపోయింది. చివరకు ఇద్దరూ కటకటాల పాలయ్యారు. 2017 డిసెంబర్‌ 11న స్వాతిని పాలమూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే ఆమెకు ఎనిమిది నెలల తర్వాత బైయిల్ వచ్చినా బైటికి రాలూని పరిస్థితి ఏర్పడింది.

గతేడాది నవంబర్ నెలలో వ్యాపారి సుధాకర్ రెడ్డి ని ప్రియుడి మోజులో భార్య స్వాతి హతమార్చింది. అంతే కాకుండా ప్రియుడు రాజేష్ ముఖంపై యాసిడ్ పోసి ప్లాస్టిక్ సర్జరీ చేయించి తన భర్త స్థానంలో తీసుకురావాలనుకుంది. ఇలా అందరిని భర్త సుధాకర్ రెడ్డిలా నమ్మించి జీవించాలనుకుంది. అయితే ఆమె ప్లాస్ బెడిసికొట్టి హత్య విశయం బైటపడి కటకటాలపాలు కావాల్సి వచ్చింది. అప్పటినుండి జూళ్లో మగ్గుతున్న ఆమెకు కోర్టు ఈ నెల 16న బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమెకు జమానత్ ఇవ్వడానికి కుటుంబ సభ్యులు గానీ బందువులు గానీ ముందుకు రాలేదు. దీంతో స్వాతికి బెయిల్ వచ్చినా బైటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఎలాగోలా  జమానత్ లభించి ఈనెల 24న బెయిల్ ఆర్డర్ వచ్చి  స్వాతి విడుదలకు అడ్డంకులు లేకుండాపోయాయి. అయితే  ఆమె ఆశ్రయం, సంరక్షణ విసయంలో పోలీసులకు మరో సమస్య వచ్చిపడింది. ఆమెకు ఆశ్రయం కల్పించడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం ఒక సమస్య అయితే ఇప్పటికే స్వాతిపై ప్రజల్లో తీవ్ర కోపం మరో సమస్య. దీంతో ఆమెకు ఆశ్రయం, సంరక్షణ విషయంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

స్వాతిని తీసుకెళ్లడానికి గానీ అసలు ఆమెను కలవడానికి గానీ తల్లిదండ్రులు ఇష్ట పడటం లేదు.  దీంతో ఆమెను స్టేట్ హోం కు గానీ లేదా హైదరాబాద్ లోని ఏదైనా స్వచ్చంద సంస్థకు గానీ అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. వీటన్నింటికి స్వాతి ఒప్పుకోని పక్షంలో జైల్లోనే కొనసాగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

English Title
twist on nagar kurnool swathi case

MORE FROM AUTHOR

RELATED ARTICLES