గుండెల మీద తూటా దూసుకొస్తుంది...తూత్తుకుడి ఎందుకు ఉడుకుతోంది?

గుండెల మీద తూటా దూసుకొస్తుంది...తూత్తుకుడి ఎందుకు ఉడుకుతోంది?
x
Highlights

గుండెల మీదుగా తూటాలు దూసుకొస్తున్నాయ్. శరీరాన్ని తూట్లు పొడుస్తున్నాయి. అయినా ఆ నిరసనహోరును ఏ తుపాకీ ఆపడం లేదు. ఎగసిపడుతున్న ఆగ్రహజ్వాలలను ఏ నీటి...

గుండెల మీదుగా తూటాలు దూసుకొస్తున్నాయ్. శరీరాన్ని తూట్లు పొడుస్తున్నాయి. అయినా ఆ నిరసనహోరును ఏ తుపాకీ ఆపడం లేదు. ఎగసిపడుతున్న ఆగ్రహజ్వాలలను ఏ నీటి బాంబులూ ఆర్పడంలేదు. విరిగిన లాఠీలా సాక్షిగా, పేలిన తూటాల సాక్షిగా, పిట్టల్లా రాలుతున్న ప్రాణాల సాక్షిగా, తూత్తుకుడి ఉవ్వెత్తున ఎగసిపడుతూనే ఉంది. రక్తసిక్తమవుతున్న తూత్తుకుడి చెబుతున్నదేంటి? స్టెరిలైట్‌ కంపెనీపై జనాగ్రహం ఎందుకీస్థాయిలో విరుచుకుపడుతోంది?

ప్రపంచంలోని అతిపెద్ద లోహ, ఖనిజ తవ్వకాల సంస్థగా పేరున్న వేదాంత గ్రూప్‌కు చెందినదే ఈ స్టెరిలైట్‌ కంపెనీ. రాగి తయారీ చేసే పరిశ్రమ. భారీ స్థాయిలో పర్యావరణ హనానికి కారణమౌతున్న సంస్థల్లో వేదాంత గ్రూపు ఒకటి. ముంబయిలో పారిశ్రామిక వేత్తగా స్థిరపడ్డ పాట్నా బీహార్ కు చెందిన అనిల్‌ అగర్వాల్‌ వేదాంత ఓనర్. గుజరాత్‌ సమీపంలోని సిల్వస్సా, తమిళనాడులోని తూతుక్కుడిలో స్టెరిలైట్‌ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

తమిళనాడులోని తూత్తుకూడిలో కాలుష్యానికి కారణమవుతున్న వేదాంత స్టెరిలైట్‌ కాపర్‌ కంపెనీని 1996లో ఏర్పాటు చేశారు. రోజుకు 1200 టన్నుల అనోడ్స్‌ అంటే, విద్యుత్‌ గ్రాహక రాగి రాడ్లను ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతమున్న ఈ సామర్థ్యాన్ని కంపెనీ రెండింతలు చేయాలనుకుంటోంది. అదే ఆందోళనకు కారణమవుతోంది. దీని వల్ల అధిక సాంద్రత గల అక్కడి జనాభాపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

కంపెనీకి పది కిలోమీటర్ల పరిధిలో ఎనిమిది పట్టణాలు, 27 గ్రామాలున్నాయి. వీటిలో దాదాపు 4.6 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. కంపెనీ నుంచి వెలువడే సల్ఫర్‌ డైఆక్సైడ్, రేణువులు కాలుష్యానికి కారణం అవుతున్నాయని ప్రాజెక్ట్‌ పర్యావరణ ప్రభావం అంచనా నివేదిక 2015లోనే వెల్లడించింది. కంపెనీ కారణంగా నీరు, వాయు కాలుష్యం ఏర్పడుతోందని గత రెండు దశాబ్దాలుగా స్థానిక ప్రజలు పెద్దఎత్తున నిరసన చేస్తున్నారు.

మరోవైపు తూత్తుకుడి ఆందోళనలు, స్టెరిలైట్ కంపెనీ విస్తరణపై మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. నిర్మాణ విస్తరణ పనులను నిలిపివేయాల్సిందిగా మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు తాజా పిటిషన్‌ దాఖలు చేయాల్సింది వేదాంత కంపెనీనీ ఆదేశించింది. దీంతోపాటు పోలీస్ కాల్పుల ఘటనపై నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హోం మంత్రిత్వ శాఖను కోరింది. తూటాలతో నిరసనకారుల ప్రాణాలు తీస్తున్నారని, అన్నాడీఎంకే, కేంద్రంలోని బీజేపీ సర్కారుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories