logo

రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నాం: ఎల్ రమణ

దేశ రాజకీయాల్లో పెను మార్పులకు తెలంగాణ ప్రజాకూటమి దోహదపడుతుందన్నారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ. రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీపై బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని తమను విమర్శించే హక్కు బీజేపీ నేతలకు లేదని అన్నారు. అధికారపక్ష దూకుడును కొంతవరకు అడ్డుకున్నామని తెలిపారు. గెలుపు, ఓటములు రాజకీయాల్లో సాధారణమే అని చెప్పారు. ప్రజాస్వామ్య గొంతుకగా టీడీపీ పని చేస్తుందని తెలిపారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

లైవ్ టీవి

Share it
Top