logo

వెంకన్న గుడిలో.. ఛీఛీ.. ఇదేం పని?

వెంకన్న గుడిలో.. ఛీఛీ.. ఇదేం పని?

టీటీడీకి వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. టీటీడీ పరిధిలో ఉన్న శ్రీనివాస మంగాపురం ఆలయం ఏఈవో శ్రీనివాసులు తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించారంటూ మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న అన్నపూర్ణమ్మ కుమార్తెను ఆలయానికి తీసుకొచ్చింది. ఆలయంలో అన్నపూర్ణమ్మ కూతుర్ని చూశాక కూతుర్ని ఒప్పించాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. వేధింపులు కాస్తా శృతిమించడంతో తల్లికూతుళ్లు చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 19న తాను చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయినా వారు ఏఈఓకు భయపడిపోయి పట్టించుకోవడం లేదని పేర్కొంది.

‘మా అమ్మ ఎస్‌ఆర్‌లో నా పేరు చేర్చడానికి ఏఈవో నన్ను వేధిస్తున్నాడు. కోరిక తీర్చమంటున్నాడు. ఆ పనిచేయకపోతే అమ్మను వేరే రాష్ట్రానికి పంపుతానంటున్నాడు. టీటీడీ ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది…’ బాధితురాలు వాపోయింది. ఈఏవో తనకు ఫోన్లో చేసిన బెదిరింపులు, కామ కోరికల వేధింపుల కాల్స్‌ను ఆమె పోలీసులకు అందించింది. కాగా, ఏఈవో ఇది వరకు కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అందుకే అతణ్ని శ్రీనివాస మంగాపురానికి బదిలీ చేశారని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. బాధితురాలి తల్లి కూడా పోలీసుకు ఫిర్యాదు చేసింది.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top