తిరుమల శ్రీవారి ప్రసాదానికి మరో గుర్తింపు

Highlights

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి మరో గుర్తింపు దక్కింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి టీటీడీ...

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి మరో గుర్తింపు దక్కింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి టీటీడీ లైసెన్స్‌ పొందింది. గతంలో లైసెన్స్‌ అవసరం లేదన్న టీటీడీ అధికారులు కొంతకాలంగా ఫుడ్ సేఫ్టీ అధికారులతో చర్చలు జరిపారు. లడ్డూ నాణ్యతపై బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రసాదం రూపంలో తయారు చేస్తున్న లడ్డులో నాణ్యత లేదని, అక్కడ లడ్డూలు తయారు చేస్తున్న వారు ఎఫ్ఎస్ఎస్ఏఐ నియమాలను పాటించడం లేదని ఆరోపించారు. దీనిపై టీటీడీ వివరణ ఇచ్చినప్పటికీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సంతృప్తి చెందలేదు. నాణ్యత పాటించాలని సూచించింది. ప్రస్తుతం ఆ ప్రమాణాలకు అనుగుణంగా లడ్డూలను తయారు చేస్తుండటంతో ఎట్టకేలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌ ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories