రైతులకు వాతావరణ శాఖ చేదువార్త

రైతులకు వాతావరణ శాఖ చేదువార్త
x
Highlights

ఈ ఏడాది రైతులకు వాతావరణ శాఖ చేదు వార్తనే అందిస్తుంది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనాలు వేస్తుంది. పసిఫిక్‌ మహాసముద్రంలో జలాలు సాధారణం...

ఈ ఏడాది రైతులకు వాతావరణ శాఖ చేదు వార్తనే అందిస్తుంది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనాలు వేస్తుంది. పసిఫిక్‌ మహాసముద్రంలో జలాలు సాధారణం కంటే అధికంగా వేడెక్కిన నేపథ్యంలో ఎల్‌నినో ఏర్పడే అవకాశాలున్నాయి. 55 శాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఎల్‌నినో ప్రభావం 80 శాతం ఉంటూ జూన్-ఆగస్ట్ నాటికి 60 శాతానికి పడిపోతుందని భావిస్తున్నారు. ఇది నైరుతీ రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ముఖ్యంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై రుతుపవనాల ప్రభావం నేరుగా ఉండబోతుంది.

వ్యవసాయ రంగానికి జీవనాధారమైన నైరుతీ రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయని స్కైమేట్ సంస్థ భావిస్తుంది. జూన్‌–సెప్టెంబర్‌ మధ్యకాలంలో 93 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశమున్నది. సంవత్సర కాలంలో నమోదయ్యే వర్షపాతంలో సుమారు 70శాతం వర్షాకాలంలోనే నమోదు కానున్నది. పసిఫిక్ మహాసముద్రంలో సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరిగాయని, దాని ప్రభావంతో ఏర్పడిని ఎల్‌నినో ప్రభావం జూన్ నుంచి ఆగస్టు వరకూ కొనసాగుతుందని స్కైమెట్ సంస్థ చెబుతుంది. 2014-15లో సైతం ఎల్‌నినో దెబ్బకు దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని గుర్తు చేస్తున్నారు.

కోస్తా ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో సీజన్‌ మొత్తం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. జూన్‌ నెలలో దీర్ఘకాలిక సగటులో 77 శాతం వర్షపాతం నమోదుకావొచ్చని సూచిస్తున్నారు. జూలైలో కొంచెం పెరిగి 91 శాతానికి ఆగస్టులో 102 శాతం, సెప్టెంబర్‌లో 99 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. సాధారణం కంటే ఎక్కువ–అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేవని స్కైమెట్ సంస్థ తేల్చిచెప్పింది.

మరో వైపు మండుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎండవేడిమి నుంచి బయటపడేందుకు జనం అల్లాడుతున్నారు. ఉదయం తొమ్మిది కాకముందే సూరీడు సుర్రుమంటున్నడు మధ్యాహ్నం నడినెత్తిమీదకు వచ్చేసరికి ఉగ్రరూపం చూపుతున్నడు సాయంత్రం ఆరైనా వేడిమి చల్లారట్లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories