TSPSC వరుస వైఫల్యాలు!

TSPSC వరుస వైఫల్యాలు!
x
Highlights

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరుస వైఫల్యాలతో అభాసుపాలౌతోంది. ఏ పరీక్ష నిర్వహిస్తున్నా ఏదో ఒక తప్పిదం జరుగుతూనే ఉంది. ఈ సంస్థ తీరు...

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరుస వైఫల్యాలతో అభాసుపాలౌతోంది. ఏ పరీక్ష నిర్వహిస్తున్నా ఏదో ఒక తప్పిదం జరుగుతూనే ఉంది. ఈ సంస్థ తీరు నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాల్సిన టిఎస్ పిఎస్సీ అనేక సందర్భాల్లో తప్పులు చేస్తూ నిరుద్యోగులను అసహనానాకి గురి చేస్తోంది. తాజాగా నిర్వహించిన గురుకుల్ ప్రిన్సిపాల్ పరీక్ష విషయంలోను టిఎస్ పిఎస్సీ డొల్లతనం బయటపడింది. దీంతో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. టిఎస్ పిఎస్సీ ని ముట్టడించారు. గురుకుల్ ప్రిన్సిపాల్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ గురుకులాల్లో ప్రిన్సిపాళ్ల పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షను రద్దు చేయకూడదని టిఎస్ పిఎస్సీ తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు రేపుతుంది. టిఎస్ పిఎస్సీ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నిరసనకు దిగారు. టిఎస్ పిఎస్సీ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. టిఎస్ పిఎస్సీ నిర్ణయంతో విభేదిస్తున్న అభ్యర్ధులు గురుకుల్ ప్రిన్సిపాళ్ల పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ నిరసనలను ఉధృతం చేశారు. రాత్రనక, పగలనక కష్టపడి చదివిన తమకు టిఎస్ పిఎస్సీ అన్యాయం చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ తీరును తప్పుపడుతున్నారు. 67 ప్రశ్నలకు రద్దు చేసి 233 ప్రశ్నల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టడం దారుణమని అభ్యర్ధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరీక్షను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

గురుకుల్ ప్రిన్సిపాళ్ల పరీక్ష ప్రశ్నాపత్రం సిద్ధం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టిఎస్ పిఎస్సీ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల నిర్వహణలో గతంలో కూడా అనేక సార్లు అవకతవకలు జరిగినా కమిషన్ తన తీరు మార్చుకోకపోవడం సిగ్గుచేటని అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories