బైక్‌పై నుంచి పడిపోయిన తెలంగాణ స్పీకర్‌

Submitted by arun on Thu, 08/16/2018 - 09:58

బైక్‌ అదుపుతప్పి స్పీకర్‌ మధుసూదనాచారి కిందపడి పోయారు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండల కేంద్రం శివారులో మంగళవారం జరిగింది. పల్లె ప్రగతి నిద్ర కార్యక్రమంలో భాగంగా స్పీకర్‌ సోమవారం రాత్రి శాయంపేట మండల కేంద్రంలో నిద్రించారు. మంగళవారం ఆరెపల్లి గ్రామానికి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పింది. దీంతో, మధుసూదనాచారి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఆయన సెక్యూరిటీ సిబ్బంది మధుసూదనాచారిని పైకి లేపారు. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతరం, మధుసూదనాచారి తన ర్యాలీని కొనసాగించడం కొసమెరుపు.
 
 

English Title
TS Speaker Madhusudhana Chary Bike Skids

MORE FROM AUTHOR

RELATED ARTICLES