సీఎం కుర్చీ కోసం కోట్లాట‌

సీఎం కుర్చీ కోసం కోట్లాట‌
x
Highlights

గత ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని ఈసారి జరగకుండా కాంగ్రెస్ అధిష్టానం ముందస్తు జాగత్తలు తీసుకుంటోంది. టీ-కాంగ్రెస్ లో సీనియర్లు ఎక్కువ ఉండడంతో అందరూ సీఎం...

గత ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని ఈసారి జరగకుండా కాంగ్రెస్ అధిష్టానం ముందస్తు జాగత్తలు తీసుకుంటోంది. టీ-కాంగ్రెస్ లో సీనియర్లు ఎక్కువ ఉండడంతో అందరూ సీఎం పదవిపై కన్నేసిన క్రమంలో పోటీని తగ్గించేందుకు వినూత్నమైన ఎత్తుగడ వేస్తున్నారు. సీనియర్లందరినీ ఎంపీలుగా ఢిల్లీకి పంపితే సీఎం కుర్చీకి కొట్లాట తగ్గడమే కాక యూత్ కు అవకాశాలు పెరుగుతాయని అధిష్టానం భావిస్తోందట.

పార్టీలో సీనియర్ల తీరుతో విసిగిపోతున్న కాంగ్రెస్ అధిష్టానం విరుగుడు మందు సిద్ధం చేస్తున్నట్లుంది. ఉన్నపళంగా సీనియర్లను రాష్ట్ర రాజీకాయాల నుంచి తప్పించి అందరినీ పార్లమెంటుకు పంపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ నుంచి ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు ఆశిస్తున్న నాయకులను పార్లమెంటుకు పంపి.. వారి పిల్లలకు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించాలని అధిష్టానం నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీలో చాలా మంది నేతలు ముఖ్యమంత్రి రేసులో ఉండడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల సీట్ల కసరత్తు పకడ్భందీగా జరగడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో నేతల మధ్య పోటీని తగ్గించడానికి వారి పరిధిలోని పార్లమెంటుకు పోటీ చేయించాలని అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు చర్చ నడుస్తోంది. వారిని పార్లమెంటుకు పోటీ చేయించడం ద్వారా వారి పరిధిలోని అసెంబ్లీ స్థానాలను సమన్వయం చేయడం కూడా సులువు అవుతుందని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

పార్లమెంట్ కు పంపేవారి లిస్టులో జానారెడ్డి, గీతారెడ్డి, డి.కే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ ఉన్నట్లు తెలుస్తోంది. వారి పిల్లలకు అసెంబ్లీ సీట్లు కావాలంటే.. సీనియర్లు అసెంబ్లీ స్థానాలు త్యాగం చేయాలంటూ అధిష్టానం సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్ నేతలంతా పునారాలోచనలో పడ్డట్టు సమాచారం. ఈ ఆదేశాలతో ముందుగానే సర్దుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తాను నల్గొండ పార్లమెంటుకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు. దీంతో తన తమ్ముడైన ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డికి లైన్ క్లియర్ చేసుకున్నట్లు పార్టీలో చర్చ జరగుతోంది. ఇక పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుటుంబానికి కూడా ఇదే ప్రతిపాదన వర్తిస్తుందని అధిష్టానం సూచిచినట్లు విశ్వసనీయ సమాచారం.

అధిష్టానం ఎత్తుగడపై పార్టీ సీనియర్లు మండిపడుతున్నట్లు సమాచారం. ఈ పథకం వెనుక పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యూహమే ఉన్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తనకు అడ్డుగా ఉన్న సీనియర్లందరినీ పార్లమెంటకు పంపించడానికే ఉత్తమ్ ఇలాంటి ప్రతిపాదన తెచ్చినట్లు సీనియర్లు మండిపడుతున్నారు. ఇలాంటి రాజకీయాలు చాలా చూశామని తాటాకు చప్పుళ్లకు తాము బెదిరేది లేదని కూడా సీనియర్లకు తేల్చి చెప్పిన్నట్లు పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. మరి.. ఈ ఎత్తుగడ ఎలాంటి ఫలితాలిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories