తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సస్పెన్స్...త్వరలో మరో కేబినెట్ సమావేశం

Submitted by arun on Sun, 09/02/2018 - 16:56
TS Cabinet

తెలంగాణ కేబినెట్‌ సమావేశం మరోసారి జరగనుంది. ఇవాళ జరిగిన సమావేశంలో చర్చించని అంశాలను ఎల్లుండి జరిగే కేబినెట్‌లో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 3గంటల్లోపు ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖల కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈసారి జరిగే సమావేశంలో ముందస్తుపై చర్చ జరగి అవకాశం ఉన్నట్టు చర్చ సాగుతోంది. 

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. కేబినెట్‌ సమావేశంలో దీనిపై క్లారిటీ వస్తుందనుకుంటే అది ఉద్యోగులకు వరాలు ప్రకటించేందుకే పరిమితమైంది. దీంతో సీఎం కేసీఆర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దు వ్యవహారంపై త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

అసెంబ్లీ రద్దు చేసే విషయమై నిర్ణయం తీసుకొనేలోపుగా ప్రభుత్వపరంగా తీసుకొనే ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు తదితర విషయాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ముందస్తు ఎన్నికలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాన్ని తీసుకొనే అవకాశం ఉంది. అయితే, త్వరలో జరిగే కేబినెట్‌ భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలుంటాయని తెలుస్తోంది. అసెంబ్లీని రద్దు చేయాలంటే కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమే ప్రధానంగా ఎజెండాగా మారే అవకాశం లేకపోలేదు. 

English Title
ts cabinet will meet soon

MORE FROM AUTHOR

RELATED ARTICLES