శత్రుదేశాల శిఖరాగ్ర సదస్సు విజయవంతం!

శత్రుదేశాల శిఖరాగ్ర సదస్సు విజయవంతం!
x
Highlights

కొన్నేళ్లుగా నలుగుతున్న సమస్యకు ఒక్క భేటీతో పరిష్కారం దొరికింది. రెండు దేశాల మధ్య శాంతి చర్చల్లో అమెరికా అధ్యక్షుడి విన్నపాన్ని ఉత్తరకొరియా అధ్యక్షుడు...

కొన్నేళ్లుగా నలుగుతున్న సమస్యకు ఒక్క భేటీతో పరిష్కారం దొరికింది. రెండు దేశాల మధ్య శాంతి చర్చల్లో అమెరికా అధ్యక్షుడి విన్నపాన్ని ఉత్తరకొరియా అధ్యక్షుడు గౌరవించారు. సాహసోపేతమైన నిర్ణయాలు సైతం ఈ భేటీలో చర్చించి పరిష్కార మార్గందిశగా ముందడుగు వేశారు.దీంతో ఇరుదేశాల ప్రజలు స్వాగతించారు. సింగపూర్ లోని ఓ హోటెల్ లో మంగళవారం ట్రంప్, కిమ్‌లు ఏకాంతంగా చర్చించారు. అనంతరం ఇరు దేశాల ప్రతినిధులతో కలసి చర్చలు నిర్వహించారు.

సదస్సు అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ.. చర్చలు నిజాయితీగా, ఫలప్రదంగా జరిగాయని, కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ ప్రక్రియ అతి త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు.అణునిరాయుధీకరణకు ఉత్తర కొరియా సమ్మతించిన నేపథ్యంలో దక్షిణ కొరియాతో కలసి చేస్తున్న ఉమ్మడి సైనిక విన్యాసాల్ని అలాగే ఉత్తరకొరియాకు ఆర్ధిక అంక్షల్ని నిలిపివేస్తామని కిమ్‌కు హామీనిచ్చినట్లు ఆయన చెప్పారు.

ఇక కిమ్ మాట్లాడుతూ.. అమెరికాతో ఉన్న గత వైరాన్ని పక్కనపెట్టి గొప్ప మార్పు దిశగా ముందుకు సాగుతామని అన్నారు. కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉన్నట్లు కిమ్‌ స్పష్టం చేశారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరతల కోసం ఇరు దేశాలు సంయుక్తంగా కృషి చేసేందుకు ఈ భేటీ ఉపయోగపడిందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories