ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి సంచలన వ్యాఖ‌్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, మీరు కూడా కళ్లు...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి సంచలన వ్యాఖ‌్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, మీరు కూడా కళ్లు మూసుకోండంటూ తనపైనా ఒత్తిడి తెచ్చారంటూ హాట్‌ కామెంట్స్ చేశారు. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదన్న జగన్‌ పారదర్శక పాలనతో దేశానికే ఆదర్శంగా నిలుద్దామంటూ మరోసారి అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు. రాష్ట్రం తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, అవినీతి కారణంగా పరిస్థితి మరింత దారుణంగా తయారైందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే వంద రూపాయల పని ఎనబైకే అవుతుందంటే రివర్స్ టెండరింగ్‌కి వెళ్దామంటూ ఇంజనీరింగ్ నిపుణుల కమిటీకి దిశానిర్దేశం చేశారు.

ప్రాజెక్టుల్లో అవినీతి విపరీతంగా పెరిగిందని, మీరు కూడా కళ్లు మూసుకోండంటూ తనపైనా ఒత్తిడి తెచ్చారని, కానీ తాను అవినీతిపై పోరాటానికి సిద‌్ధమయ్యానంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెడిపోయిన వ్యవస్థను బాగు చేయడానికి తపిస్తున్నానన్న జగన్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ అవినీతిని సహించేది లేదన్నారు. ఈ మెసేజ్ పైనుంచి నుంచి కిందిస్థాయి వరకు వెళ్లాలన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదని, అత్యంత పారదర్శకంగా టెండర్ల విధానం రూపొందించాలన్నారు. వంద రూపాయల పని ఎనబైకే జరుగుతుందంటే రివర్స్ టెండరింగ్‌కి వెళ్దామన్నారు. ఇంజనీరింగ్ నిపుణుల కమిటీతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ పోలవరం సహా అన్ని ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్‌ ఎక్కడెక్కడ చేయగలమో గుర్తించాలని సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇంజనీరింగ్‌ పనుల పునసమీక్ష కోసం నియమించిన ఉన్నతస్థాయి కమిటీతో సమావేశమైన జగన్మోహన్‌రెడ్డి ఏఏ అంశాలపై ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేశారు. ముఖ‌్యంగా సాగునీటి ప్రాజెక్టుల అంచనాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. జలవనరులతోపాటు ఆర్‌ అండ్ బీ, మున్సిపల్‌, సీఆర్డీఏలో కాంట్రాక్టులను పునసమీక్షించాలని సూచించారు. అలాగే వరద ముప్పు ఉన్న ప్రాజెక్టులపై తొలుత అధ్యయనం చేయాలని కోరారు. ఇక పోలవరం పనుల్లో అక్రమాలపై నిగ్గుతేల్చాలని ఇంజనీరింగ్ నిపుణుల కమిటీని ఆదేశించారు. 15రోజుల్లో మరోసారి నిపుణుల కమిటీతో సమావేశం కావాలని నిర్ణయించిన జగన్‌ ఈసారి ప్రాజెక్టుల వారీగా పూర్తి వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో పోలవరం దగ్గర గోదావరి వెడల్పు తగ్గిందన్న జగన్‌ స్పిల్‌వే పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్‌కు వెళ్లడంతో 4నెలలపాటు పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

రాష్ట్రం తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, అవినీతి కారణంగా పరిస్థితి మరింత దారుణంగా తయారైందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఏదేమైనా ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదన్న జగన్మోహన్‌రెడ్డి అవినీతి రహిత, పారదర్శక పాలనతో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే ఆదర్శంగా నిలవాలని, అందుకే జ్యుడీషియల్ కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరినట్లు మరోసారి గుర్తుచేశారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories