రామ్ చరణ్ తేజ్ బాట లో వైష్ణవ తేజ్

రామ్ చరణ్ తేజ్ బాట లో వైష్ణవ తేజ్
x
Highlights

యువ కథానాయకుడు వైష్ణవ తేజ్ మెగా ఫామిలీ నుండి ఇండస్ట్రీ లో కి వస్తున్న కొత్త వ్యక్తి. ఇప్పటికే చాలా మంది టాలెంటెడ్ నటుల్ని పరిశ్రమ కి అందించిన ఈ ఫామిలీ...

యువ కథానాయకుడు వైష్ణవ తేజ్ మెగా ఫామిలీ నుండి ఇండస్ట్రీ లో కి వస్తున్న కొత్త వ్యక్తి. ఇప్పటికే చాలా మంది టాలెంటెడ్ నటుల్ని పరిశ్రమ కి అందించిన ఈ ఫామిలీ నుండి వస్తున్న వైష్ణవ్, సాయి ధరమ్ తేజ్ కి తమ్ముడు. తన మొదటి సినిమా నే పెద్ద బానర్ అయినా మైత్రి మూవీ మేకర్స్ తో చేస్తున్నాడు ఈ కొత్త కుర్రాడు. సుకుమార్ కూడా ఈ సినిమా నిర్మాణం లో భాగస్వామి అవ్వడం విశేషం.

తన తో చాలా ఏళ్ళు కలిసి పని చేసిన అసిస్టెంట్ బుచ్చి బాబు ఈ సినిమా తో దర్శకుడి గా పరిచయం అవుతున్నాడు. అయితే ఈ సినిమా కి ముందు గా జాలరి అనే టైటిల్ ని పెడదాం అనుకున్నారు కానీ చివరకి ఉప్పెన అనే టైటిల్ ని ఖరారు చేశారు నిర్మాతలు. సోషల్ మీడియా లో ఈ సినిమా కథ అంటూ చాలా వార్తలు తిరుగుతున్న నేపథ్యం లో ఈ సినిమా కూడా రంగస్థలం మాదిరి గా నే పరువు హత్యల బాక్డ్రాప్ లో ఉండబోతుంది అనే సమాచారం అందింది. ఈ సినిమా లో వైష్ణవ్ జాలరి పాత్ర లో నటించనున్నాడు. న‌క్ష‌త్ర‌, దేవికా సంజ‌య్ పేర్లు హీరోయిన్ పాత్ర కి ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కి సంగీతం అందించనున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories