'తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు చేస్కోండి'

తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు చేస్కోండి
x
Highlights

కాళేశ్వరం ఓపెనింగ్‌ను గ్రామగ్రామాన సెలబ్రేట్‌ చేసుకోవాలని టీఆర్ఎస్‌ పిలుపునిచ్చింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న గులాబీ...

కాళేశ్వరం ఓపెనింగ్‌ను గ్రామగ్రామాన సెలబ్రేట్‌ చేసుకోవాలని టీఆర్ఎస్‌ పిలుపునిచ్చింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న గులాబీ బాస్‌‌‌ 27నుంచి పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని ఆదేశించారు. దసరా నాటికి ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్‌ నిర్మాణం పూర్తిచేయాలని దిశానిర్దేశం చేశారు.

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో గులాబీ అధినేత పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ మరింత బలోపేతమే లక్ష్యంగా కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై చర్చించారు. ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాలకు భూమిపూజ చేయాలని సూచించిన గులాబీ బాస్‌‌. 27నుంచి నెలరోజులపాటు పెద్దఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ఇక ఈనెల 27న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులతో మరోసారి కేసీఆర్ సమావేశం కానున్నారు. అలాగే జులై చివరి నాటికి సభ్యత్వ నమోదు కంప్లీట్‌ చేసి గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలు వేయాలని గులాబీ దళపతి నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ నిధులతోనే జిల్లాల్లో కార్యాలయాలు నిర్మించనున్నట్లు పల్లా తెలిపారు. పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం 19కోట్ల 20లక్షల రూపాయలను కేటాయించామన్నారు. ఒక్కో భవనాన్ని 60లక్షలతో నిర్మించనున్నట్లు వెల్లడించారు. దసరా నాటికి ప్రారంభోత్సవాలు చేసుకునేలా నిర్మాణాలు పూర్తిచేస్తామన్నారు. తెలంగాణ వరప్రదాయిని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈనెల 21న గ్రామగ్రామాన సంబరాలు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్‌ పిలుపునిచ్చింది. ప్రతి రైతూ సంబరాల్లో పాల్గొనాలని పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories