టీఆర్‌ఎస్‌కు పోటీగా బీజేపీ...

టీఆర్‌ఎస్‌కు పోటీగా బీజేపీ...
x
Highlights

అభ్యర్ధుల ప్రకటనలో ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో పార్టీలన్నీ తుది జాబితాలను ప్రకటిస్తున్నాయి. ఇక అధికార పార్టీ...

అభ్యర్ధుల ప్రకటనలో ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో పార్టీలన్నీ తుది జాబితాలను ప్రకటిస్తున్నాయి. ఇక అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు పోటీగా అభ్యర్ధులను ప్రకటిస్తూ వస్తోన్న బీజేపీ దాదాపు అన్ని స్థానాల్లోనూ పోటీకి దిగుతోంది. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో పార్టీలన్నీ ఫైనల్ లిస్టులను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు పోటీగా అభ్యర్ధులను ప్రకటిస్తూ వస్తోన్న బీజేపీ ఒకే రోజు ఐదు, ఆరు జాబితాలను అనౌన్స్ చేసింది. ఐదో జాబితాలో 19మందిని, ఆరో జాబితాలో ఆరుగురిని ప్రకటించింది. ఈ జాబితాల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కక బీజేపీలో చేరిన వారు కూడా ఉన్నారు.

ఐదో జాబితాలో జుక్కల్‌-అరుణతార, బాన్సువాడ-నాయుడు ప్రకాశ్‌, బాల్కొండ-ఆర్‌.రాజేశ్వర్, మంథని-రెండ్ల సనత్‌కుమార్‌, చొప్పదండి-బొడిగె శోభ, మహేశ్వరం-శ్రీరాములు యాదవ్‌, వికారాబాద్‌-రాయ్‌పల్లి సాయికృష్ణ, జడ్చర్ల-మధుసూదన్‌యాదవ్, కొల్లాపూర్‌-సుధాకర్‌రావు, దేవరకొండ-రవి, మిర్యాలగూడ-కర్నాటి ప్రభాకర్, హుజూర్‌నగర్‌-భాగ్యారెడ్డి, కోదాడ-జల్లపల్లి వెంకటేశ్వరరావు, తుంగతుర్తి-కడియం రామచంద్రయ్య, జనగామ-కేవీఎల్‌ఎన్‌రెడ్డి,డోర్నకల్‌-లక్ష్మణ్‌నాయక్, ములుగు-దేవీలాల్‌, వరంగల్‌ ఈస్ట్‌-కుసుమ సతీష్‌, కొత్తగూడెం-బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి సీట్లు కేటాయించింది.

ఇక ఆరో జాబితాలో ఆరుగురికి సీట్లు కేటాయించారు. మంచిర్యాల నుంచి వీరబెల్లి రఘునాథరావు, బోధన్ నుంచి అల్జాపుర్ శ్రీనివాస్, నర్సాపుర్ నుంచి ఎస్.గోపి, కుత్బుల్లాపూర్‌ నుంచి కాసాని వీరేశ్, పరిగి నుంచి కరణం ప్రహ్లాదరావు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి గణేశ్‌కు సీట్లు దక్కాయి. మొత్తానికి అధికార టీఆర్‌ఎస్‌ తర్వాత దాదాపు మొత్తం అన్ని స్థానాల్లో పోటీచేస్తున్న మరో పార్టీ బీజేపీ ఒక్కటే కనిపిస్తోంది. ఎందుకంటే మహా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ 94 స్థానాల్లో పోటీచేస్తుండగా, మిగతా పార్టీలు నామమాత్రంగానే బరిలోకి దిగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories